MLC 2025 LAKR Vs WAF Highlights: ప్రస్తుతం లీగ్ క్రికెట్ యుగం నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ నడుస్తోంది. ఒకప్పటి దిగ్గజ ప్లేయర్లు మొత్తం ఈ లీగ్ లో ఆడుతున్నారు. ఈ లీగ్ లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడం, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠ మధ్య సాగింది. ప్లేయర్లు ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. టెక్సాస్ లో జరిగిన ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి 427 పరుగులు చేయడం విశేషం.. అయితే ఈ మ్యాచ్లో ముందుగా లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ 213 పరుగులు చేసింది. ఈ జట్టులో ఓవెన్ 43, మాక్స్ వెల్ 42 పరుగులు చేసి అదరగొట్టారు. సంఘా రెండు వికెట్లు సాధించాడు. 214 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం జట్టు.. చివరి ఓవర్ వరకు పోరాడింది. చివరి బంతికి సింగిల్ తీసి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చివరి వరకు కూడా ఉత్కంఠ గా సాగడం విశేషం.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
వాషింగ్టన్ ఫ్రీడం జట్టు ఇన్నింగ్స్ సమయంలో
చివరి ఓవర్ రస్సెల్ వేశాడు. ఆ ఓవర్ చివరి బంతికి స్ట్రైకర్ గా ఫిలిప్స్ ఉన్నాడు. రస్సెల్ వేసిన చివరి బంతిని ఫిలిప్స్ గట్టిగా కొట్టాడు. ఆ బంతి అమాంతం గాల్లోకి ఎగిరింది. అయితే ఆ క్యాచ్ ను హోల్డర్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అప్పటికి వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 213 పరుగులు చేసింది. చివరి బంతి క్యాచ్ డ్రాప్ కావడంతో ఫిలిప్స్ వేగంగా సింగిల్ తీశాడు. దీంతో వాషింగ్టన్ జట్టు విజయం సాధించింది. అంతిమంగా ఐదు వికెట్ల వ్యత్యాసంతో గెలుపును సొంతం చేసుకుంది.
సాధారణంగా టి20 మ్యాచ్లలో సమీకరణాలు వేగంగా మారిపోతుంటాయి. అప్పటిదాకా గెలుపు బాటలో ఉన్న జట్టు ఒక్కసారిగా ఓటమిపాలవుతుంది. ఆ క్షణం దాకా ఓడిపోతుందనుకున్న జట్టు గెలుస్తుంది. టి20 లో ప్లేయర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆటగాళ్లు అద్భుతమైన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా నిరూపించుకునే సమయంలో కొన్ని సందర్భాల్లో విఫలమవుతుంటారు. అవే ప్రత్యర్థి జట్టుకు అస్త్రాలుగా మారిపోతాయి. అంతిమంగా విజయాన్ని అందిస్తాయి. ప్రస్తుతం ఈ టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడం, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అలాంటిదే. చివరి వరకు విజయం ఈ రెండు జట్ల మధ్య దోబూచులాడింది. చివరికి వాషింగ్టన్ ఫ్రీడం జట్టుకు విజయాన్ని అందించింది.
UREAL SCENES IN MLC
– 1 needed in the final ball, Glenn Philips on strike, Russell bowling, Holder drops the Catch & Washington Freedom won the match. pic.twitter.com/TNOSEosrXv
— Johns. (@CricCrazyJohns) June 27, 2025