Gorantla Buchaiah seat issue: గత ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తు కారణంగా ఎక్కడికక్కడే ఇబ్బందులు తలెత్తాయి. కొందరు టిడిపి సీనియర్లకు అవకాశం దక్కకుండా పోయింది. అయితే అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( gorantla bhootchayya Chaudhari). జనసేన కోసం ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బుచ్చయ్య చౌదరి సీనియారిటీ, సిన్సియార్టీ తెలిసిన చంద్రబాబు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చివరకు బుచ్చయ్య చౌదరి కోసం పవన్ కళ్యాణ్ విన్నపాన్ని కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో పవన్ సూచించిన నేతకు వేరే నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తాజాగా అదే విషయాన్ని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Singayya Postmortem Report: పెద్దగాయాలు లేవు. ఎలా చనిపోయాడు.. సింగయ్య పోస్టుమార్టం రిపోర్ట్.. వైరల్
సుదీర్ఘ నేపథ్యం..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. రాజమండ్రి( Rajahmundry) నుంచి ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. విద్యార్థి సంఘాలలో చురుకైన పాత్ర పోషించే బుచ్చయ్య చౌదరి 1982లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్ గా వ్యవహరించారు. 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేస్తూనే పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు ఎన్టీఆర్. 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ తన క్యాబినెట్లో తీసుకున్నారు. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారు. అటు తరువాత లక్ష్మీపార్వతి వర్గంగా ఉండిపోయారు. 1996లో ఎన్టీఆర్ టిడిపి తరఫున రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
చంద్రబాబు ఆహ్వానం మేరకు
అయితే లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) తీరు నచ్చక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు బుచ్చయ్య చౌదరి. 1997లో చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో రాజమండ్రి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య చౌదరి. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టికెట్ను జనసేన కోరుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ప్రకటించాలని పవన్ కళ్యాణ్ కోరారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదు. కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ కేటాయించారు. అప్పట్లో పట్టు పట్టి మరి బుచ్చయ్య చౌదరి తన సీటును పదిలం చేసుకున్నారు. 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
పవన్ పరోక్ష వ్యాఖ్యలు..
అయితే తాజాగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ కు ఆత్మీయంగా స్వాగతం పలికారు బుచ్చయ్య చౌదరి. సభా వేదికపై బుచ్చయ్య చౌదరి గురించి ప్రస్తావించారు. ఏదైనా సాధించాలంటే బుచ్చయ్య చౌదరి లా ఉండాలి అంటూ.. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ నేతలకు పిలుపునిచ్చారు. తద్వారా 2024 ఎన్నికలకు ముందు టిక్కెట్ విషయంలో జరిగిన విషయాలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు పవన్. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనం తగ్గాలి కానీ ఆయన తగ్గడు..గోరంట్లపై పవన్ పంచులు | Pawan Massive Comedy On Gorantla Buchaiah#rajahmundry #deputycmpawankalyan #JanaSenaParty #Prime9News pic.twitter.com/GLavWqzUaK
— Prime9News (@prime9news) June 26, 2025