West Indies Vs Australia 1st Test: ఉదాహరణకు 2023 వన్డే వరల్డ్ కప్ ను తీసుకుంటే.. అప్పటిదాకా రోహిత్ సేన ఒక్క ఓటమి అనేది లేకుండా ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్లో మాత్రం ఒత్తిడికి తలవంచింది. చేసిన పరుగులను కాపాడుకోలేక చేతులెత్తేసింది. ఫలితంగా మరో మారు కంగారు జట్టును విజేతన చేసింది. వాస్తవానికి ఒత్తిడిలో కంగారు జట్టు అద్భుతంగా ఆడుతుంది. ప్రత్యర్థి జట్టుతో మైండ్ గేమ్ ఆడుతూ అదరగొడుతుంది. అందువల్లే కంగారు జట్టు కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ మీద జట్టుకు సాధ్యం కాని రీతిలో పెత్తనం సాగిస్తోంది. అద్భుతమైన విజయాలు అందుకుంటూ ఐసీసీ ట్రోఫీలను అందుకుంటున్నది. అయితే అలాంటి కంగారు జట్టు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో తడబడుతోంది. ఇక ప్రస్తుతం 2025 -27 కు సంబంధించి డబ్ల్యూటీసీ మొదలైంది. ఈ సీజన్లో కంగారు జట్టు తన తొలి టెస్ట్ సిరీస్ కరేబియన్లతో ఆడుతున్నది. కరేబియన్ల సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్లో కంగారులు ఇబ్బంది పడుతున్నారు.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు!
ఇటీవల కంగారు జట్టు డబ్ల్యూటీసీ తుది పోరులో సఫారీ లతో తలపడింది. అయితే సఫారీల దూకుడు ముందు తలవంచింది. అంతేకాదు ఊహించని విధంగా ఓటమిని ఎదుర్కొన్నది. రన్నరప్ తో కంగారు జట్టు సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు కరేబియన్ల తో తలపడుతోంది కంగారు జట్టు. కరేబియన్ల సొంత గడ్డలో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు చేసింది. పదిపరుగుల లీడ్ సాధించింది.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కంగారు జట్టు రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కంగారు జట్టులో హెడ్ 13, వెబ్ స్టర్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కొన్ స్టాస్ 5, ఖవాజా 15, గ్రీన్ 15, ఇంగ్లిస్ 13 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచారు. విండిస్ బౌలర్లు సమర్ జోసెఫ్, అల్జారి జోసెఫ్, జేడన్ సీల్స్, గ్రీవ్స్ తలా ఒక వికెట్ సాధించారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో విండీస్ బౌలర్లలో సీల్స్ ఐదు వికెట్లు సాధించాడు. సమర్ జోసెఫ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక విండీస్ తొలి ఇన్నింగ్స్ లో కంగారు బౌలర్లు అదరగొట్టారు. కమిన్స్ 2, స్టార్క్ 3, హేజిల్ వుడ్ 2 వికెట్లు సాధించారు. కరేబియన్ జట్టులో హోప్ 48 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
He just keeps going! UNPLAYABLE! #AUSvsWI #WIvsAUS #AUSvWI #WIvAUS pic.twitter.com/kYMigmlBdO
— The Sports Feed (@thesports_feed) June 25, 2025