https://oktelugu.com/

MI Vs RR 2024: ఆ ఒక్కడే అడ్డుగా నిలబడ్డాడు.. ముంబైని ఓడించాడు

ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ మాత్రమే చేసింది. ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( 21 బంతుల్లో 34, తిలక్ వర్మ ( 29 బంతుల్లో 32) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 2, 2024 / 08:19 AM IST

    MI Vs RR 2024

    Follow us on

    MI Vs RR 2024: బౌలింగ్లో అదరగొట్టింది. బ్యాటింగ్ లో తడబడినప్పటికీ కుదురుకుంది. మొత్తానికి వాంఖడే లో ముంబై పై గెలిచింది. పాయింట్ల పట్టికలో చెన్నైని పక్కనపెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం రాత్రి ముంబై వేదికగా ముంబై జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. సొంత గడ్డపై ముంబై జట్టును ఓడించి ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 3/22, చాహల్ 3/11, బ్యాటింగ్లో రియాన్ పరాజ్ 54* సత్తా చాటడంతో రాజస్థాన్ తిరుగులేని విజయాన్ని అందుకుంది.

    ముందుగా ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ మాత్రమే చేసింది. ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( 21 బంతుల్లో 34, తిలక్ వర్మ ( 29 బంతుల్లో 32) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. వీరు కూడా కీలక సమయంలో అవుట్ కావడంతో ముంబై జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ మెరుపుల్లాంటి బంతులు సంధించి ముంబై పతనాన్ని శాసించారు. బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

    అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 27 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీ సాధించింది. రియాన్ పరాగ్ మాత్రమే రాజస్థాన్ జట్టులో నిలబడ్డాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మద్వాల్ మూడు వికెట్లు తీశాడు. మపాక ఒక వికెట్ పడగొట్టాడు.

    స్వల్ప స్కోర్ అయినప్పటికీ రాజస్థాన్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. పైగా ముంబై బౌలర్లు సొంతమైదానం కావడంతో దూకుడుగా బౌలింగ్ చేశారు. రియాన్ పరాగ్ నిలబడక పోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఓవర్ యాక్టింగ్ స్టార్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అతడిని గేలి చేసినప్పటికీ.. ఈ ఐపీఎల్ 17వ సీజన్లో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ పరాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు, ఢిల్లీ జట్టుతో 84 పరుగులతో నాట్ అవుట్, తాజా మ్యాచ్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. IPL కంటే ముందు రియాన్ పరాగ దేశవాళి క్రికెట్ లో సత్తా చాటాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో అదే ఫామ్ ఐపీఎల్ లో కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ జట్టు సాధించిన మూడు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. పరాగ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    స్వల్ప స్కోరే అయినప్పటికీ ముంబై బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆకాశ్ మద్వాల్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప స్కోర్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి. పరాగ్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఏమీ చేయలేని పరిస్థితి. పరాగ్ ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేయడంతో ముంబై జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్న ముంబై జట్టు.. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్ నమోదు చేసింది. కాగా, ముంబై జట్టుపై గెలుపు ద్వారా రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయగా.. రాజస్థాన్ తో ఓటమి ద్వారా ముంబై జట్టు హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.