https://oktelugu.com/

MI vs RCB: ఇది ఐపీఎల్లా?.. కర్రా బిల్లా?.. దినేష్ కార్తీక్ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు

ఆ తర్వాత బంతిని నేరుగా యార్కర్ వేస్తే.. దానిని కూడా దినేష్ ఫోర్ గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో బెంగళూరు జట్టుకు 19 పరుగులు లభించాయి. చివరి ఓవర్ లోనూ దినేష్ కార్తీక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 19 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ కూడా ఆకాశ్ వేయడం విశేషం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 11, 2024 / 10:01 PM IST

    MI vs RCB: Innovative batting by Dinesh Karthik against Mumbai Indians

    Follow us on

    MI vs RCB : ఐపీఎల్ అంటే దూకుడుకు పర్యాయపదం. వేగానికి ప్రతిపదార్థం.. ఎంత ధాటిగా ఆడితే జట్టుకు అంత స్కోరు లభిస్తుంది. ఎంత స్కోరు లభిస్తే విజయానికి అంత దగ్గరవుతుంది. అందుకే టి20ల్లో ఆటగాళ్లు ధనా ధన్ ఇన్నింగ్స్ కు ప్రాధాన్యమిస్తారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, గేల్, రోహిత్ శర్మ వంటి వారు పంచ్ హిట్టర్లు గా పేరు పొందారంటే కారణం వారి దూకుడైన ఆట తీరే. ఈ జాబితాలో బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ పూర్తి విభిన్నం. ఒళ్ళును విల్లులాగా ఉంచి ఆడతాడు. 360 డిగ్రీలు కాదు.. 720 డిగ్రీల్లోనూ బ్యాటింగ్ చేస్తాడు. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అలాంటి ఆట తీరు ప్రదర్శించి అలరించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షాట్లు అలానే ఆడి పరుగులు పిండుకున్నాడు.

    ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా తొలి వికెట్ కు మెరుపు ఆరంభం లభించలేదు. జాక్స్ (8), మాక్స్ వెల్(0) , లామ్రోర్(0), సౌరవ్ చౌహన్ (9) వంటి వారు పూర్తిగా నిరాశపరిచారు.. కెప్టెన్ డూ ప్లెసిస్(61), రజత్ పాటిదార్(50), దినేష్ కార్తీక్ (55 ) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 196 రన్స్ స్కోర్ చేయగలిగింది.

    అయితే ఈ మ్యాచ్లో మాక్స్ వెల్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనదైన ఆట తీరుతో అలరించాడు. దూకుడుకు అసలు సిసలైన పర్యాయపదంలాగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 55 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ తీరుతో బెంగళూరు 196 పరుగుల స్కోర్ చేసింది. ముఖ్యంగా 16 ఓవర్లో అతడు ఆడిన ఆట ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్.

    16 వ ఓవర్ ను ఆకాష్ వేశాడు..తొలి బంతి వైడ్ గా వెళ్ళింది. మరుసటి బంతిని డూ ప్లెసిస్ సింగిల్ తీసి దినేష్ కార్తీక్ స్ట్రైక్ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైంది దినేష్ కార్తీక్ మాయాజాలం. రెండో బంతిని ఆకాష్ ఫుల్ టాస్ వేయగా.. జస్ట్ బ్యాట్ వంచి దినేష్ ఆడాడు.. ఆ బంతి నేరుగా ఒక స్టెప్ తీసుకొని బౌండరీ దాటింది. మరుసటి బంతిని ఆకాష్ డాట్ బాల్ గా వేశాడు. ఇంకో బంతిని ఫుల్ టాస్ వేయగా దినేష్ కార్తీక్ సేమ్ అలానే బ్యాట్ వంచి ఆడాడు. అది కూడా బౌండరీ దాటింది. మరుసటి బంతిని కూడా అలాగే వేయడంతో దినేష్ కార్తీక్ ఈసారి మరింత విభిన్నంగా బ్యాట్ తిప్పి కొట్టాడు. ఫలితంగా బంతి ఫోర్ వెళ్లింది. ఒత్తిడిలో ఆకాష్ ఆరో బంతిని వేసే క్రమంలో అది వైడ్ వెళ్ళింది. ఆ తర్వాత బంతిని నేరుగా యార్కర్ వేస్తే.. దానిని కూడా దినేష్ ఫోర్ గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో బెంగళూరు జట్టుకు 19 పరుగులు లభించాయి. చివరి ఓవర్ లోనూ దినేష్ కార్తీక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 19 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ కూడా ఆకాశ్ వేయడం విశేషం.