After watching this video, Maxwell must think
Glenn Maxwell : గత ఏడాది చివర్లో మన దేశం వేదికగా జరిగిన వరల్ద్ కప్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది గుర్తుంది కదా.. అందులో ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు వెంటవెంటనే అవుట్ అయితే..మాక్స్ వెల్ రంగంలోకి వచ్చాడు. భారీ స్కోరు ను చేదించాడు. కాలు నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ భరించి.. చివరి వరకు మైదానంలో నిలిచాడు. అద్భుతమైన డబుల్ సెంచరీ తో చెలరేగి ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్లోకి వెళ్ళింది. భారత జట్టును మట్టికరిపించి ఆరవసారి వరల్డ్ కప్ సగర్వంగా అందుకుంది. మరి అలాంటి ఆటగాడు ఐపీఎల్ లో ఎలా ఆడాలి.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి. బౌలర్లపై పరాక్రమాన్ని ప్రదర్శించాలి. బ్యాటుతో మైదానంలో తాండవం చేయాలి. కానీ చేస్తున్నది ఏమిటి..
బెంగళూరు జట్టు తరఫున ఐపీఎల్ లో ఆడుతున్న మాక్స్ వెల్ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో వస్తున్న ఈ మేటి ఆటగాడు ఇంతవరకు తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో అతడు చేసిన పరుగులు 80 లోపే అంటే బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని హైయెస్ట్ స్కోర్ 25 పరుగులు దాటలేదంటే అతడి ఫామ్ ఎలా సాగుతోందో అవగతం చేసుకోవచ్చు. ఇలాంటి ఆటగాడిని బెంగళూరు జట్టు కోట్లకుకోట్లు పోసి కొనుగోలు చేసింది.. మిడిల్ ఆర్డర్లో రావడం.. కొన్ని బంతులు ఎదుర్కోవడం నిర్లక్ష్యపు షాట్ లు ఆడటం.. ఆ తర్వాత అవుట్ కావడం..మాక్స్ వెల్ కు ఈ ఐపీఎల్లో పరిపాటిగా మారింది.. వరుసగా విఫలం అవుతున్నప్పటికీ అతడి స్థానంలో మరొక ఆటగాడికి బెంగళూరు యాజమాన్యం అవకాశం ఇవ్వడం లేదు. మిగతా జట్లలో వర్తమాన ఆటగాళ్లు విజృంభిస్తున్న ఈ టోర్నీలో.. బెంగళూరు జట్టు మాక్స్ వెల్ విషయంలో ఉదారత చూపుతోంది. ఈ దశలో మాక్స్ వెల్ ఆట తీరును ఉద్దేశించి కొంతమంది కుర్రాళ్ళు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతుంటారు. అందులో ఓ యువకుడు వీర విహారం చేస్తుంటాడు. ప్రతి బంతిని బ్యాట్ తో ఓ రేంజ్ లో కొడుతుంటాడు. మ్యాక్స్ వెల్ ఇలాంటి ఆట తీరు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తరఫున ప్రదర్శించాడని సింబాలిక్ గా చెబుతాడు. ఆ తర్వాత ఎదురైన బంతులను సరిగ్గా ఆడడు. కొన్ని బంతులను నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అవుతుంటాడు.. ఇదీ మాక్స్ వెల్ ఐపీఎల్ లో బెంగళూరు తరఫున ఆడుతున్న ఆట అంటూ చిన్నపాటి ఇండికేషన్ ఇస్తాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..”ఈ వీడియో చూసిన తర్వాత మాక్స్ వెల్ సిగ్గుతో తలదించుకుంటాడు కావచ్చు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.