https://oktelugu.com/

MI Vs LSG: వరుసగా రెండు సిక్స్ లు.. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వదిలి పారిపోయాడు: ట్రోలింగ్

టీమిండియాలో సచిన్ టెండూల్కర్ పేరు చెబితే చాలు.. కేరింతలు, ఈలలు వినిపిస్తాయి.. తనకు మాత్రమే సాధ్యమైన రికార్డులను సచిన్ సృష్టించి వెళ్ళాడు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడి సరికొత్త ఘనతలను తన పేరు మీద లిఖించుకున్నాడు.

Written By: , Updated On : May 18, 2024 / 08:19 AM IST
MI Vs LSG

MI Vs LSG

Follow us on

MI Vs LSG: ఏ రంగంలోనైనా ప్రతిభ ఉంటేనే అవకాశాలు వస్తాయి. సెలబ్రిటీల పిల్లలకు, ఆటగాళ్ల పిల్లలకు ఇందులో కొంత మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే వారి తండ్రులో, లేదా ఇతర కుటుంబ సభ్యుల లెగస్సీ వైల్డ్ కార్డు లాగా ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత దానిని సుస్థిరం చేసుకోవాలంటే.. అది వారి ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. ఎలాగో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చాం. ఏదో షో చేసి వెళ్తామంటే కుదరదు. ముఖ్యంగా క్రికెట్లో అది అస్సలు కుదరదు. అందువల్లే మాజీ క్రికెటర్ల పిల్లల్లో కొంతమంది భావి స్టార్లుగా ఎదగలేకపోయారు. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదే..

టీమిండియాలో సచిన్ టెండూల్కర్ పేరు చెబితే చాలు.. కేరింతలు, ఈలలు వినిపిస్తాయి.. తనకు మాత్రమే సాధ్యమైన రికార్డులను సచిన్ సృష్టించి వెళ్ళాడు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడి సరికొత్త ఘనతలను తన పేరు మీద లిఖించుకున్నాడు. వన్డే, టెస్ట్, టి20 లలో అద్భుతంగా పరుగులు చేసి క్రికెట్ గాడ్ గా అవతరించాడు. అటువంటి ఆటగాడి వారసుడిగా అర్జున్ టెండూల్కర్ తెరపైకి వచ్చాడు.. అప్పట్లో సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడేవాడు. ఆ తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. అతడు వెళ్తూ వెళ్తూ.. తన కొడుకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నిర్ణయించుకున్నాడు. దేశవాలి క్రికెట్ ఆడుతున్న తన కుమారుడికి. ముంబై ఇండియన్స్ జట్టులో ప్రవేశం దక్కేలా చేశాడు.. కానీ దానిని అర్జున్ నిలుపుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో ముంబై తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.. సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్న అతడు.. సత్తా చూపలేకపోయాడు. 2.2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చుకున్నాడు.. దీంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి.

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు.. ఈ సీజన్లో దారుణమైన ఆట తీరును ప్రదర్శించడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ప్లే ఆఫ్ ఆశలను వదిలేసుకున్న లక్నో జట్టు. చివరి మ్యాచ్ లో గెలవాలనే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు మ్యాచ్లో ముంబై పై లక్నో జట్టు దాటిగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లక్నో జట్టు బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ముంబై కెప్టెన్ బౌలింగ్ కూర్పులో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు 15 వ ఓవర్ వేసే బాధ్యత అప్పగించాడు. ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ ఆడటం ఇదే మొదటిసారి. అతడు వేసిన 15 ఓవర్లో తొలి రెండు బంతులను పూరన్ సిక్స్ లు గా మలిచాడు. దీంతో తనకు గాయమైందని చెబుతూ అర్జున్ టెండూల్కర్ డగ్ అవుట్ కు వెళ్లిపోయాడు. అయితే అయిన గాయానికి చికిత్స తీసుకోకుండా.. డగ్ ఔట్ లో అలానే కూర్చుండిపోయాడు. దీంతో నెటిజన్లు అర్జున్ టెండూల్కర్ ను ఏకిపడేస్తున్నారు. నిజంగా గాయమైందా? లేకుంటే భయపడ్డాడా? గట్టిగా రెండు ఓవర్లు పూర్తిగా వేయలేని వ్యక్తి.. సచిన్ టెండుల్కర్ వారసుడు ఎలా అవుతాడని దెప్పిపొడుస్తున్నారు.. సచిన్ కొడుకై ఉండి.. రెండు సిక్సులకే వెనకడుగు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా మైదానంలో బంతులు వేసిన అర్జున్.. పలికించిన హావాభావాలు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. అసలు ఇది సోషల్ మీడియా కాలం కావడంతో నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.