Odi World Cup 2023
Odi World Cup 2023: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు కొంతవరకు తడబడుతూ ఆడుతున్నారు. వరల్డ్ కప్ కి ముందు ఇండియా తో ఆడిన 3 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా టీమ్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ లో విజయం.సాధించింది… అలాగే వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి రెండు మ్యాచ్ ల్లో కూడా వరుసగా పరాజయాలను అందుకున్నారు. ఇక దాంతో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఎవరు కూడా ఫామ్ లో లేరు అని అందరు అనుకున్నారు. కానీ కట్ చేస్తే వరుసగా విజయాలను అందుకుంటూ ఆస్ట్రేలియా టీమ్ వరుసగా మ్యాచ్ లను గెలుచుకుంటూ వస్తుంది.ఇక ఇంతకు ముందు మాక్స్ వెల్ అంతగా ఫామ్ లో లేనప్పటికీ ఇప్పుడు మాత్రం తనదైన రీతిలో విరుచుకుపడి ఆడుతున్నాడు.
అందులో భాగంగానే మ్యాక్స్ వెల్ అప్పుడు రెండు సెంచరీలు చేయడం జరిగింది.ఇక ఈ టోర్నీ లో 7 ఇన్నింగ్స్ లలో 397 పరుగులు చేసిన ఆయన రెండు సెంచరీలను కూడా నమోదు చేసుకున్నాడు. ఇక అందులో ఒకటీ డబల్ సెంచరీ ఉండటం విశేషం… ఇక అందులో భాగంగానే ఆఫ్గనిస్తాన్ మీద ఆయన ఆడిన ఆట చూస్తే ప్రతి ప్రేక్షకుడిని కూడా అలరించిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆయన ఒంటరి పోరాటం చేసి మొత్తానికి అయితే ఆస్ట్రేలియాని విజేతగా నిలిపాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కీ క్వాలిఫై అయింది…
నిజానికి ఆఫ్గనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మ్యాక్స్ వెల్ ని ఒక్కడిని కట్టడి చేయడంలో మాత్రం వాళ్లు విఫలమయ్యారు. ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ అయిన షాహిది బౌలర్లను మార్చినప్పటికీ మ్యాక్స్ వెల్ ను అవుట్ చేసే బౌలర్ అయితే ఎవరూ కనిపించలేదు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చెలరేగి ఆడుతూ గ్రౌండ్ నలువైపులా సిక్స్ లు, ఫోర్లు కొడుతూ బౌలింగ్ వేసే బౌలర్ ఎవరైనా సరే ఉతికి ఆరేసాడు. ఇక ఈ వరల్డ్ కప్ కి ముందు మ్యాక్స్ వెల్ పెద్దగా ఫామ్ లో లేడు అని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఇన్నింగ్స్ ద్వారా సరైన సమాధానాన్ని చెప్పాడు… ఫైనల్ గా ఒక హిట్టర్ తలుచుకుంటే మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమి కాదని తను కొట్టి ప్రూవ్ చేసి చూపించాడు…
ఇక ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా తన నెక్స్ట్ మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడనుండగ అది గెలిస్తే నెంబర్ టు లోకి వచ్చే అవకాశం ఉంది…అయిన ఆస్ట్రేలియా టీమ్ నెంబర్ 2 లో ఉన్న,లేదా నెంబర్ 3 లో ఉన్న పెద్దగా వచ్చేదేమి లేదు…