Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలైట్స్.. బిగ్ బాస్ చేసిన పనికి కన్నీరు మున్నీరైన హౌస్ మేట్స్, శివాజీ కొడుకుతో శోభ ఓవర్ యాక్షన్!

మాస్క్ ధరించి ఉన్న కొడుకును శివాజీ గుర్తించలేదు. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంది? వ్యాయామం చేస్తున్నారా? వంటి ప్రశ్నలు అడిగాడు. వాటికి శివాజీ సమాధానం చెప్పాడు. ఫైనల్ గా కొడుకు నాన్నా అంటూ తన మాస్క్ తీసేశాడు.

Written By: NARESH, Updated On : November 8, 2023 9:01 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఫ్యామిలీ వీక్ కి చేరుకుంది. రెండు నెలలకు పైగా ఇంటి సభ్యులను మిస్ అవుతున్న హౌస్ మేట్స్ కి ఉపశమనం కలిగిస్తున్నారు. హౌస్ మేట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్లో అడుగుపెడుతున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో ముగ్గురు హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కలిసేందుకు వచ్చారు. మొదటిగా శివాజీ పెద్ద కొడుకు వచ్చాడు. ఇతడు సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. శివాజీని మెడికల్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ అక్కడ డాక్టర్ వేషంలో కొడుకును ఉంచాడు.

మాస్క్ ధరించి ఉన్న కొడుకును శివాజీ గుర్తించలేదు. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంది? వ్యాయామం చేస్తున్నారా? వంటి ప్రశ్నలు అడిగాడు. వాటికి శివాజీ సమాధానం చెప్పాడు. ఫైనల్ గా కొడుకు నాన్నా అంటూ తన మాస్క్ తీసేశాడు. దాంతో శివాజీ షాక్ తో పాటు భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్ మేట్స్ కి శివాజీ కొడుకును పరిచయం చేశాడు. శోభ శెట్టి కేకలు వేస్తూ, ఎగురుతూ ఓవర్ యాక్షన్ చేసింది. శివాజీ కొడుకు యావర్, ప్రశాంత్ లకు కృతజ్ఞతలు చెప్పాడు. నాన్నను బాగా చూసుకున్నారని అన్నాడు.

అనంతరం హౌస్లోకి అర్జున్ భార్య సురేఖ ఎంట్రీ ఇచ్చింది. సురేఖ గర్భవతి కాగా అనేక విషయాలు పంచుకుంది. అర్జున్ నువ్వు రియాక్ట్ అవ్వు. ఎదుటి వాళ్ళు నిన్ను ఏదైనా అన్నప్పుడు కామ్ గా ఉంటే నచ్చడం లేదు. నీ ఎమోషన్స్ బయటపెట్టు అని సలహా ఇచ్చింది. స్వయంగా అర్జున్ కి అన్నం తినిపించిన సురేఖ, కప్పు ముఖ్యం అని గుర్తు చేసింది. బిగ్ బాస్ సురేఖకు సీమంతం ఏర్పాట్లు చేశాడు. చీర, పూలు, గాజులు, పండ్లు ఏర్పాటు చేశాడు.

హౌస్ మేట్స్ సురేఖ సీమంతం వేడుక నిర్వహించారు. అర్జున్, సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత అశ్విని తల్లి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూసిన అశ్విని కన్నీరు మున్నీరు అయ్యింది. తల్లి అశ్వినికి అనేక సలహాలు ఇచ్చింది. నువ్వు పెద్దవాళ్లతోనే ఉండు. మంచి పేరు తెచ్చుకుని బయటకు రావాలి. స్ట్రాంగ్ గా ఉండని చెప్పింది. ఒక్కోసారి బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది. ఉండబుద్ది కావడం లేదని అశ్విని ఏడ్చింది. అమ్మ వెళ్లిపోయే ముందు బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది. ఈ రాత్రికి అమ్మను ఉంచు బిగ్ బాస్, ఆమెతో పడుకుంటాను అని కోరింది. అది కుదరదు కాబట్టి.. అశ్విని తల్లి వెళ్ళిపోయింది… ఇవాళ మిగిలిన హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వస్తారు.