https://oktelugu.com/

Glenn Maxwell: ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచం మొత్తాన్ని భయపెట్టే హిట్టర్ నే మెప్పించిన మాక్స్ వెల్…

నిజానికి ఆస్ట్రేలియా టీమ్ కి ఒక రకంగా చెప్పాలంటే ఇది డూ ఆర్ డై మ్యాచ్... ఆస్ట్రేలియా సెమీఫైనల్ కి దగ్గరగా ఉన్నారు కానీ సెమీఫైనల్ కి వెళ్లాలంటే మాత్రం ఈ ఒక్క మ్యాచ్ గెలవాలి.అలాంటి టైం లో అఫ్గాన్ తో ఆడిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ఆల్మోస్ట్ ఓటమి పాలైంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2023 8:32 am
    Glenn Maxwell

    Glenn Maxwell

    Follow us on

    Glenn Maxwell: వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా టీం ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఒక దశలో 91 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా టీం పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క బ్యాట్స్ మెన్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనం వేసే అడిగే మనకు దారి చూపిస్తుంది అనే సూత్రాన్ని ఫాలో అవుతూ మ్యాక్స్ వెల్ ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయానికి తెర లేపాడనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఏ ఒక్క ప్లేయర్ కూడా అంతటి గొప్ప ఇన్నింగ్స్ ని ఆడలేదు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్ లు కొట్టి 201 పరుగులను చేసి నాట్ అవుట్ గా మ్యాక్స్ వెల్ చివరి వరకు క్రీజ్ లో నిలబడి మరి ఆస్ట్రేలియా కి ఒక భారీ విజయాన్ని అందించాడు. ఆయన కాలు కి దెబ్బ తగిలిన కూడా కాలుని కదపకుండా సిక్స్ లు, ఫోర్లు కొడుతూ మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చాడు…

    నిజానికి ఆస్ట్రేలియా టీమ్ కి ఒక రకంగా చెప్పాలంటే ఇది డూ ఆర్ డై మ్యాచ్… ఆస్ట్రేలియా సెమీఫైనల్ కి దగ్గరగా ఉన్నారు కానీ సెమీఫైనల్ కి వెళ్లాలంటే మాత్రం ఈ ఒక్క మ్యాచ్ గెలవాలి.అలాంటి టైం లో అఫ్గాన్ తో ఆడిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ఆల్మోస్ట్ ఓటమి పాలైంది. అనుకున్న టైమ్ లో మాక్స్ వెల్ వచ్చి మొత్తం మ్యాచ్ ని మళ్లీ ఆస్ట్రేలియా చేతిలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క ప్లేయర్ గా గ్లెన్ మక్స్ వెల్ నిలిచాడు…ఇక ఈ మ్యాచ్ చూసిన తర్వాత అందరూ చెప్తున్న మాట ఒక్కటే మ్యాక్స్ వెల్ పేరు చెప్పి గుర్తుపెట్టుకో వరల్డ్ కప్ మాక్స్ వెల్ పేరు సానా ఏళ్ళు యాదుంటది అని చెప్తున్నారు…

    ఇక అదే రేంజ్ లో ప్రపంచ క్రికెట్ కి తనలోని హిట్టర్ ని పరిచయం చేసిన వ్యక్తి మాక్స్ వెల్…ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచ కప్ లో హీరో అయిపోయాడు… ఈయన ఆడిన ఇన్నింగ్స్ మీద చాలామంది చాలా రకాలుగా స్పందించారు. అందులో ముఖ్యంగా క్రికెట్ లో హిట్టర్ అనే పదానికి పర్యాయపదంగా వాడే వీరేంద్ర సెహ్వాగ్ కూడా మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ కి ఫిదా అయిపోయాడు.ఇక దాన్ని ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేయడం జరిగింది. చేజింగ్ లో 200 పరుగులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది వన్డేలలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుంది.అలాగే మాక్స్ వెల్ కి సపోర్ట్ చేసిన కమ్మిన్స్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ ఆడిన ఇన్నింగ్స్ చాలా రోజులు పాటు గుర్తుంటుంది.ఒక సామాన్య మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని అసాధ్యాన్ని, సుసాధ్యం చేసి చూపించిన మాక్స్ వెల్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

    ఇక అతనితోపాటుగా తెలుగు సినిమా డైరెక్టర్ అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఎస్ ఎస్ రాజమౌళి కూడా మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ పట్ల స్పందిస్తూ మ్యాడ్ మ్యాక్స్ అంటూ ట్వీట్ చేస్తూనే నా కెరియర్లో ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్ నేనేప్పుడు చూడలేదు అని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది… నిజంగా ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్ వెల్ కెరియర్ లోనే కాదు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు పదిలంగా ఉండిపోతుందనే చెప్పాలి…