Mahesh Babu – Pat Cummins : మనదేశంలో క్రికెట్ కి , సినిమాకి ఉన్న క్రేజ్ ఇంకా దేనికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాగే టాలివుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆయన రీసెంట్ గా పాట్ కమ్మిన్స్ తో కలిసి ఫోటో దిగాడు ఇక దానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
అలాగే 2023 లో ఆస్ట్రేలియా కు వన్డే వరల్డ్ కప్ అందించడంలో తను కీలకపాత్ర వహించాడు. ఇక ఇప్పుడు ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి కూడా కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. ఆయన సారధ్యంలో టీం దూకుడుగా ఆడుతూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పాట్ కమ్మిన్స్ ను కలిశారు. ఇక ఈ విషయాన్ని తను సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోని షేర్ చేస్తూ ‘మహేష్ బాబు గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ కొన్ని మాటలు అయితే రాశారు.
ఇక దానికి ప్రిన్స్ మహేష్ బాబు స్పందిస్తూ ‘నేను మీకు పెద్ద అభిమానిని, మిమ్మల్ని కలవడం నాకు కూడా ఆనందంగా ఉంది’. అంటూ రిప్లై అయితే ఇచ్చాడు. ఇలా వీళ్ళిద్దరూ కలుసుకోవడం వెనకాల అసలు రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక దీని మీద సోషల్ మీడియా లో పలురకాల కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి కమ్మిన్స్ తో దగ్గర సంబంధాన్ని కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు కూడా తన సినిమా చేసే కంటే ముందే ఫేమస్ అవుతాడని అలా చేశాడేమో అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనతో కలిసి ఫోటో దిగితే బాగుంటుందనే ఉద్దేశ్యం తో మహేష్ బాబు అలా చేశాడని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వీళ్ళు ఎందుకు కలుసుకున్నారో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుందనే చెప్పాలి…