Maldives : ఆ మధ్య లక్షద్వీప్ ప్రాంతానికి వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యాటకంగా ప్రమోట్ చేశారు గుర్తుంది కదా.. అది మాల్దీవులకు ఎక్కడో కాలింది.. ఫలితంగా వివాదాలు, భారతీయుల బైకాట్ నినాదాలు.. సీన్ కట్ చేస్తే భారత్ దూరం జరిగితే.. మాల్దీవులు చైనాకు దగ్గరయింది. అంతేకాదు చైనా ఏం చెప్తే అది చేసే స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాదు, పలు వేదికల వద్ద పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి వ్యవహార శైలి పట్ల మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అతడి పరిపాలనపై విమర్శలు చేశారు. అయితే ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మాల్దీవులలో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారీ మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం 93 పార్లమెంటు స్థానాలు ఉన్న మాల్దీవులలో డబ్బే స్థానాలను పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ చేసుకోవడం విశేషం.. ఈ ఎన్నికలను ముయిజ్జు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్ జాగ్రత్తగా పరిశీలించాయి.
మాల్దీవుల పార్లమెంటును పీపుల్స్ మజ్లీస్ అని పిలుస్తారు. ఈ దేశంలో 93 నియోజకవర్గాలున్నాయి. ఆదివారం వీటికి పోలింగ్ నిర్వహించారు. పతం శిక్షణ టు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. మాల్దీవులలో మాత్రమే కాకుండా భారత్ లోని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 2.84 లక్షల ఓటర్లు మాల్దీవుల ప్రాంతంలో ఉన్నారు. 70% పోలింగ్ నమోదయింది. ఈ ఫలితాలలో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం 70 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి సంబంధించిన మిత్ర పక్షాలు మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక మన దేశానికి అనుకూలమైన వ్యక్తిగా ఉంటే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి కి చెందిన మాల్దీవ్య డెమొక్రటిక్ పార్టీ కేవలం 15 స్థానాల వద్ద ఆగిపోయింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ ఏకంగా 65 స్థానాలు దక్కించుకుంది.
మాల్దీవులలో చిన్న చిన్న ద్వీపాలు కలిపి మొత్తం 1,192 ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ 800 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. తెలుపు రంగు సముద్రపు తీర్థాలు, రిసార్ట్ లతో అద్భుతంగా ఉండే ఈ ప్రాంతం.. హిందూ మహాసముద్రంలో పలు రాజకీయాలకు వేదికగా మారిపోయింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దేశంపై భారత్ పెత్తనాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. చైనాతో స్నేహాన్ని పెంచుకున్నారు. ఇటీవల ఆ దేశంలో పర్యటించి పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతేకాదు చైనా దేశానికి చెందిన పలు కంపెనీలకు ముఖ్యమైన కాంట్రాక్టులు కేటాయించారు. అంతేకాదు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోవాలని గడువు కూడా విధించారు. దీంతో భారతదేశానికి చెందిన సైన్యం వెనక్కి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు ముయిజ్జు వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు మాట మార్చి ముయిజ్జు తమ దేశానికి భారత్ నుంచి ఆర్థిక సహాయం చాలా ముఖ్యమని పత్తిత్తు కబుర్లు చెప్పారు.