Maharaja T20 Trophy: క్రికెట్ చరిత్రలో ఇది పెను సంచలనం.. ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు.. చివరికి ఫలితం ఏంటంటే?

Maharaja T20 trophy: టి20 అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఇప్పటి క్రికెట్లో ఇప్పటివరకు ఎన్నో సంచలనాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టి20 ట్రోఫీ లోను సంచలనం నమోదయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 24, 2024 10:39 am

Maharaja T20 Trophy

Follow us on

Maharaja T20 Trophy: శుక్రవారం మహారాజా టి20 ట్రోఫీలో ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు రెండు సూపర్ ఓవర్లు మాత్రమే జరిగాయి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్, ముంబై జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు మహారాజా ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠ గా మారింది. ఏకంగా మూడు సూపర్ ఓవర్ల ద్వారా ఈ మ్యాచ్ ఫలితం వెళ్లడైంది. అయితే చివరికి హుబ్లీ టైగర్స్ జట్టను విజయం వరించింది.. ఈ మ్యాచ్లో హుబ్లీ టైగర్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 164 రన్స్ చేసింది. కెప్టెన్ మనీష్ పాండే 22 బంతుల్లో 33 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత బెంగళూరు బ్లాస్టర్స్ నిర్మిత 20 ఓవర్లలో 164 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఫలితంగా రెండు జెట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఫలితాన్ని నిర్దేశించేందుకు అంపైర్లు ముందుగా సూపర్ ఓవర్ ఆడించారు. ఈ ఓవర్ లో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు వికెట్ నష్టపోయి 10 రన్స్ చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అనిరుధ్ జోషి 8 పరుగులు మాత్రమే చేశాడు.. ఆ తర్వాత టైగర్స్ జట్టు కూడా పది పరుగులు మాత్రమే చేయడంతో స్కోరులు టై అయ్యాయి. దీంతో రెండవ సూపర్ ఓవర్ లో హుబ్లీ టైగర్స్ 8 రన్స్ చేసింది. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా అదే స్థాయిలో స్కోర్ చేసింది. దీంతో మరోసారి పరుగులు సమం అయ్యాయి. ఫలితంగా మూడవసారి సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. ఈ ఓవర్ లో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసింది. అనంతరం హుబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో హుబ్లీ టైగర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే మైదానంలో ఈ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఊపిరి బిగబట్టారు. క్రికెట్ చరిత్రలో ఇది అసాధారణ మ్యాచ్ గా రికార్డు సృష్టించింది.

ఐసీసీ 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత సూపర్ ఓవర్ల విషయంలో నిబంధనలను పూర్తిగా సదలించింది. ఆనాటి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ తలపడింది.. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌండరీల సంఖ్య అనే అసంబద్ధమైన నిబంధనతో విజేతగా ఆవిర్భవించింది.. అప్పట్లో ఈ నిబంధన పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో కట్ ఆఫ్ సమయంలోపు ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడించాలని ఐసీసీ నిబంధన విధించింది. దీంతో మహారాజా టి20 టోర్నీలో తుది ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్లు ఆడించాల్సి వచ్చింది.