LSG vs PBKS
LSG vs PBKS : ప్రస్తుత ఐపిఎల్ ఎడిషన్లో ఆటిట్యూడ్ స్టార్ లక్షణాలు ఏ ఆటగాడిలో కనిపించడం లేదు ఏంటా అని సందేహిస్తున్న ప్రేక్షకులకు.. మంగళవారం లక్నో , పంజాబ్(LSG vs PBKS) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు దిగ్వేష్ రాటి(Digvesh Rathi). లక్నో మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (LSG vs PBKS) తలపడ్డాయి.. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి.. పిచ్ పరిస్థితులను అంచనా వేసి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.. పడిపోతున్న లక్నో జట్టు బ్యాటింగ్ ను పూరన్ (44), ఆయుష్ బదోని (41) నిలబెట్టేందుకు ప్రయత్నించారు. వారి వల్లే లక్నో జట్టు ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది..
Also Read : బలాబలాలు, గెలిచేది ఏ జట్టంటే..
172 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఏ దశలోనూ ఓటమి దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (Prabh Simran Singh) (69), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)(52*), నేహళ్ వదేరా(43*) ఆకాశమేహద్దుగా చెలరేగారు. మొత్తంగా 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. 8 వికెట్ల తేడాతో తమ జట్టును గెలిపించుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు కొనసాగించారు.. అయితే పంజాబ్ జట్టు ఆటగాళ్లు అంతలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం లక్నో బౌలర్ దిగ్వేష్ రాటి.. ఎందుకంటే చేజింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు 26 పరుగుల వద్ద ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి ప్రియాన్ష్ అవుట్ అయ్యాడు. అతడు అవుటైన వెంటనే దిగ్వేశ్ రెండు చేతులతో వింతగా సైగలు చేశాడు. ఈ వికెట్ తో మీ ఓటమికి సంబంధించి బుక్కు రాస్తున్నట్టు పేర్కొన్నాడు. తన చేతుల్లో పంజాబ్ జట్టు పేక ముక్కల్లాగా కూలిపోతుందని సంకేతాలు ఇచ్చాడు. అయితే అవి పంజాబ్ ఆటగాళ్లు అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇంకేముంది వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రెండో వికెట్ కు ఏకంగా 84 పరుగులు జోడించి.. పంజాబ్ జట్టు విజయాన్ని ముందుగానే ఖాయం చేశారు. దిగ్వేష్ బౌలింగ్లో ఓవర్ కు 7.50 చొప్పున రన్ రేటుతో 30 పరుగులు పిండుకున్నారు. దిగ్వేష్ ఓవరాక్షన్ చేయడంతో.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో నేహల్ వదేరా 6,6,4 కొట్టడంతో పంజాబ్ అభిమానులు రెచ్చిపోయారు. దిగ్వేష్ కు తగ్గట్టుగానే సరైన స్థాయిలో స్పందించారు. దిగ్వేష్ మాదిరిగానే రెండు చేతులతో వింత సైగలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి.
Also Read : అతడే మా కొంపను కూల్చాడు.. లేకుంటే వేరే తీరుగా ఉండేది: ధావన్
DIGVESH RATHI DROPS AN ABSOLUTE BANGER CELEBRATION. ❤️pic.twitter.com/kJWRa0xWtM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025