LSG Vs PBKS: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు సొంతమైదానంలో ఆడుతున్న మ్యాచ్ ఇదే. ఈ రెండు జట్లు విజయంపై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అత్యధిక స్కోర్ తేడాతో గెలిచింది..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును వారి సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఆడుతున్న రెండో మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్లో గెలిచిన నేపథ్యంలో.. విజయపరంపర కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ రెండు జట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. లక్నో జట్టులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ వంటి వారు ఉన్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో యజువేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్ దీప్ సింగ్, గ్లెన్ మాక్స్ వెల్ వంటి వారు ఉన్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని తెలుస్తోంది. ఈ రెండు జట్లు కూడా విజయంపై కన్నువేశాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ జట్టు మరింత ముందుకు వెళుతుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం పంజాబ్ జట్టు ఐదవ స్థానంలో ఉంది. లక్నో జట్టు మూడో స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే మూడో స్థానంలోకి వెళ్తుంది. ఒకవేళ లక్నో జట్టు కనుక విజయం సాధిస్తే రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
Also Read: రిజర్వ్ బెంచ్ నుంచి..నిప్పు కణిక లాగా..
మైదానం ఎలా ఉందంటే
లక్నో స్టేడియం స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. స్లో పిచ్ కావడంతో బంతి బ్యాట్ మీదికి ఊహించినంత స్థాయిలో రాదు. బౌలర్లు గనుక పట్టు సాధిస్తే బ్యాటర్లకు ఈ పిచ్ పై పరుగులు తీయడం కష్టమవుతుంది. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ లొకేట్ చేయాల్సి ఉంటుంది. పవర్ ప్లే లో బ్యాటర్లు పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలి. ఇక ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18/ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు కింగ్స్ 11 పంజాబ్, లక్నో జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. మూడుసార్లు లక్నో విజయం సాధించింది. పంజాబ్ ఒకే ఒక్కసారి గెలిచింది. గత సీజన్లో లక్నో జట్టును పంజాబ్ 21 పరుగుల తేడాతో ఓడించింది. 2022లో లక్నో జట్టు పంజాబ్ ను 20 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం లక్నో కు 52, పంజాబ్ కు 48 శాతం విజయావకాశాలు ఉన్నాయి.
జట్ల అంచనా
లక్నో
మార్క్రం, మిచెల్ మార్ష్, పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.
పంజాబ్ కింగ్స్
ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, స్టోయినిస్, మాక్స్ వెల్, సూర్యాంశ్, అజ్మతుల్లా, జాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.