Ashwani Kumar: విపరీతమైన పోటీ మధ్య కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే ఆడే అవకాశం లభిస్తుంది. అవకాశం లభించిన ఆటగాళ్లు మొత్తం గొప్పగా ఆడలేరు. కొంతమంది మాత్రమే తమ ప్రతిభను నిరూపించుకుంటారు. అలాంటి వారిలో ప్రస్తుత ఐపీఎల్ 18 ఎడిషన్ లో అశ్వని కుమార్ ముందు వరుసలో ఉన్నాడు. కోల్ కతా(MI vs KKR)తో జరిగిన మ్యాచ్ ద్వారా నాలుగు వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.. అశ్వని కుమార్ తన కెరియర్లో తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు. తన వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. మొత్తంగా మూడు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 24 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు తీశాడు. దీంతో మీడియాలో, సోషల్ మీడియాలో అశ్వని కుమార్ పై విపరీతమైన చర్చ మొదలైంది. అశ్వని కుమార్ వయస్సు 23 సంవత్సరాలు. పంజాబ్ లోని మొహాలి ఇతడి స్వస్థలం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు..
Also Read: అశ్వని కుమార్ 4 వికెట్ల వెనుక అసలు రహస్యం ఇది..
షేర్ – ఏ – పంజాబ్ లీగ్ లో..
షేర్ – ఏ – పంజాబ్ లీగ్ ద్వారా ఇతడు ఒకసారిగా వెలుగులోకి వచ్చాడు. అందరి దృష్టిలో పడ్డాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు.. దీంతో పంజాబ్ జట్టు 2024 ఐపీఎల్ సీజన్లో అశ్విని కుమార్ ను కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. ఇక గత ఏడాది జరిగిన మెగా వేలంలో ముంబై జట్టు అశ్వని కుమార్ ను 30 లక్షలకు కొనుగోలు చేసింది. అశ్వని కుమార్ కు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్లలో అవకాశం లభించలేదు. ఇక సోమవారం వాంఖడే మైదానంలో కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో అశ్వని కుమార్ కు ముంబై జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని అశ్విని కుమార్ వినియోగించుకున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే వికెట్ ను అశ్విని కుమార్ పడగొట్టాడు. అదే కాదు మరో మూడు వికెట్లు తీసి కోల్ కతా నైట్ రైడర్స్ పతనాన్ని శాసించాడు.. అశ్వని కుమార్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానే (11), రింకూ సింగ్(17), మనీష్ పాండే (19), రస్సెల్(5) వంటి డేంజరస్ ప్లేయర్లను అశ్విని కుమార్ పెవిలియన్ పంపించాడు. అశ్విని కుమార్ అద్భుతమైన బంతులు వేయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరుగులు తీయడంలో తడబడ్డారు. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ 116 పరుగులకే కుప్ప కూలింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో రఘు వంశీ (26), రమణ్ దీప్ సింగ్ (22) ఆ కాస్త పరుగులు చేయకపోతే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది.