TTD Trust Board
TTD Trust Board: తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా స్వామి వారి దర్శనాలు వేగంగా పూర్తయ్యేలా చూడాలని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై విమర్శలు ఉన్నాయి. భక్తులు అరగంటలో స్వామివారి దర్శనం సంతృప్తిగా పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేసవి సెలవులు దృష్ట్యా సిఫారసు లేఖలను పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. దివ్యాంగులు, వృద్ధులకు దర్శనంలో మార్పులు చేస్తోంది. టోకెన్ల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయించింది. టీటీడీలో సంస్కరణలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సాధారణంగా వేసవిలో( summer ) భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పాఠశాలలకు సెలవు కారణంగా ఎక్కువమంది స్వామివారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తారు. అందుకే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించి త్వరగా దర్శనం జరిగేలా నిర్ణయం తీసుకుంది. వీరికి ఆన్లైన్ విధానములో మాత్రమే దర్శన టోకెన్లను జారీచేస్తున్నారు. అయితే ఇప్పుడు పాత విధానంలో ఆఫ్ లైన్ లోనే టోకెన్ల గారికి నిర్ణయించారు. దీంతో నాలుగేళ్ల తర్వాత పాత విధానం అమలు చేయనున్నారు అన్నమాట. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతోపాటు శారీరిక, మానసిక వైకల్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టిటిడి దర్శన భాగ్యం కల్పించేది. కరోనాకు ముందు ప్రతిరోజు 1400 మంది వరకు ఇలా దర్శనం చేసుకునేవారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని రద్దు చేశారు.
Also Read : కొడాలి నానికి సర్జరీ.. పరిస్థితి ఎలా ఉందంటే?
* ప్రత్యేక కౌంటర్ల ద్వారా..
గతంలో ఎస్వీ మ్యూజియం( SV museum) ఎదురుగా కౌంటర్ల ద్వారా ఉదయం పదగంటల స్లాట్ కు 700 మంది, మధ్యాహ్నం మూడు గంటలకు 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతోపాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్ పునరుద్ధరించారు. అయితే ఒకేసారి భక్తుల రద్దీ పెరగడంతో కొద్దిరోజులపాటు టోకెన్లు ఇచ్చి తర్వాత నిలిపివేశారు. అప్పటినుంచి ఆన్లైన్లోనే ఈ టోకెన్ల జారీ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఈ విధానం తెలియని వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతున్నారు.
* పాత విధానం పునరుద్ధరణ..
అయితే తాజాగా పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయించడం విశేషం. అయితే ఇప్పటికే మూడు నెలల కాలానికి సంబంధించి ఆన్లైన్ టోకెన్ల జారీ ప్రక్రియ( online token issues ) పూర్తయింది. అది ముగిశాక ఆఫ్ లైన్ విధానం ప్రారంభం కానుంది. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి? ఏ సమయంలో ఇవ్వాలి? ఎలాంటి నిబంధన పాటించాలనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల్లోనూ మార్పులపై టీటీడీ కసరత్తు చేస్తోంది. గతంలో అమలు చేసిన విధంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రారంభించేలా ట్రయల్ రన్ వేయనున్నారు.
* వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనం..
గతంలో విఐపి బ్రేక్( VIP break darshanam) దర్శనాన్ని ఉదయం 10:30 గంటలకు మార్చారు. రాత్రంతా కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంపై విఐపి ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే వేకువజామున 5:30 గంటలకి విఐపి బ్రేక్ దర్శనం తిరిగి పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు సిఫారసు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అయితే రేపు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారులు భేటీ కానున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, ఇతరత్రా మార్పులపై చర్చించునున్నారు.
Also Read :
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ttd trust board ttd takes key decision on delay in darshans in tirumala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com