LSG Vs CSK IPL 2025: అయితే ఈసారి గురువు కెప్టెన్ గా ఉన్నాడు. చెన్నై జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు.మరోవైపు గత సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకుడిగా ఉన్న రిషబ్ పంత్ ఈసారి లక్నోకు మారాడు. 27 కోట్ల ప్యాకేజీ తో ఈ ఐపిఎల్ లో హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. డబ్బుల పరంగా చూసుకుంటే ఓకే గాని.. ఆట తీరు పరంగా చూసుకుంటే రిషబ్ పంత్ ఆ స్థాయిలో లేడు. కానీ చెన్నై జట్టుపై మాత్రం రిషబ్ పంత్ కు తిరుగులేని రికార్డు ఉంది. గురువు జట్టు కావడంతోనే రిషబ్ ఈ స్థాయిలో చెన్నై అందరూ భావిస్తుంటారు. చెన్నై జట్టుతో జరిగిన జరిగిన ఏ మ్యాచ్ లోనూ అంచనాలను రిషబ్ పంత్ తలకిందులు చేయడు. అన్నింటికీ మించి చెన్నై జట్టుతో మ్యాచ్ అనగానే దూసుకు పోతాడు. గతంలో ఎలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ.. చెన్నై జట్టుపై మాత్రం దూకుడుగా ఆడుతాడు. అందువల్లే చెన్నై జట్టుపై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది..
Also Read: చెన్నై కి కొత్త ఊపిరి పోసిన ఆ ఒక్క ఓవర్…
ఎన్ని పరుగులు చేశాడంటే..
చెన్నై జట్టుపై ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్.. 438 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 48. 66 గా ఉంది. స్ట్రైక్ రేటు 152.1 గా ఉంది. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. ఇక సోమవారం నాటి మ్యాచ్లో చెన్నై పేస్ బౌలర్ల బౌలింగ్లో 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 173.07 గా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ లో 23 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 78.26 గా ఉంది.. ఇక ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటివరకు స్పిన్ బౌలర్ల బౌలింగ్లో పంత్ 43 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. రెండుసార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 72.09 గా ఉంది. ఇక పేస్ బౌలింగ్లో 56 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేశాడు. ఇక చెన్నై జట్టు బౌలర్ పతీరణ బౌలింగ్ లో నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్ 55 పరుగులు చేశాడు. అయితే ఇవి కేవలం 29 బంతుల్లోనే కావడం విశేషం. అంతేకాదు మూడు సార్లు అవుట్ అయ్యాడు. ఇక యావరేజ్ 18.33 గా ఉండగా, స్ట్రైక్ రేట్ 189.65 గా ఉంది. ఇక రిషబ్ పంత్ గత సీజన్ నుంచి ఇప్పటివరకు 1-6 ఓవర్లలో బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో 109 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. ఇందులో మూడుసార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 106.42, డాట్స్ 58 బాల్స్ గా నమోదయ్యాయి. ఇక సోమవారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు.
Also Read: ఎన్నో రోజులకు ఫినిషర్ ధోనీ మళ్ళీ మెరిశాడు… ఇదే కంటిన్యూ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే!