Lalit Modi : ఐపీఎల్ లో జరిగిన అవకతవకలలో అతడిది కీలక పాత్ర ఉన్నదని అప్పట్లో ఆరోపణలు రావడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇవ్వడం.. ఐపీఎల్ లో భారీగా నగదు చేతులు మారినట్టు వార్తలు రావడంతో లలిత్ మోడీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతడు లండన్ లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ.. ఇప్పటికీ లలిత్ మోడీ ధ్యాస మొత్తం ఐపీఎల్ మీదే ఉంది. అయితే తాజాగా ఆయన ఐపీఎల్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ లో కొచ్చి టీం పుట్టుక వెనక అసలు విషయాలను వెల్లడించారు. ఓ యూ ట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ ఈ విషయాలను వెల్లడించారు. దీంతో అది కాస్త సంచలనగా మారింది. లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రస్తావన ఉండడం ఇక్కడ విశేషం..
ఒత్తిడి వచ్చింది
యూపీఏ హయాంలో ఐపీఎల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట్లో కొచ్చి జట్టు ఉండేది కాదు. ఆ తర్వాత కాలక్రమంలో కొచ్చి జట్టు పురుడు పోసుకుంది. అయితే ఈ ఫ్రాంచైజీ కి ఓకే చెప్పాలని నాడు 10 జన్ పథ్ (సోనియా, రాహుల్ గాంధీ) నుంచి ఒత్తిడి వచ్చినట్టు లలిత్ మోడీ వెల్లడించారు. ” కొచ్చి కొత్త జట్టులో మొత్తం 12 మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఇందులో సునంద పుష్కర్ కూడా ఉన్నారు. ఆమె సున్నా పెట్టుబడి పెట్టారు. 15 మిలియన్ డాలర్ల కన్సర్షియంలో 25% వాటా ఆఫర్ చేశారు. దానికి నేను నో చెప్పాను. దీంతో శశిధరూర్ నాపై ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించారు. నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. అందువల్లే ఏర్పాటుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని” లలిత్ వ్యాఖ్యానించారు. శశిధరూర్, సునంద పుష్కర్ సహజీవనం కొనసాగించేవారు. చాలా ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటికీ ఆమె మృతి మిస్టరీగానే ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని శశి థరూర్, లేదు అది హత్య అని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అయినప్పటికీ ఆ కేసు నుంచి శశి సులభంగానే బయటపడ్డారు. ఇక లలిత్ ఆమధ్య సుస్మితాసేన్ తో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో విడుదల చేశారు. కొద్దిరోజులపాటు వారిద్దరు కలిసి ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారని జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. లలిత్ కంటే ముందు సుస్మితసేన్ రోహన్ అనే యువకుడితో చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు.. అయితే ఇప్పుడు లలిత్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఫ్రాంచైజీ కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకువస్తే.. ఇన్ని రోజుల దాకా లలిత ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఇప్పుడే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే లలిత్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇంతవరకు శశిధరూర్ స్పందించలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shashi tharoor threatened lalit modi to give him kochi tuskers kerela ipl team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com