https://oktelugu.com/

Shyam Singha Roy: మనమే విజేతలం అంటే ఎలా నాని ?

Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ అంటూ నాని తనను, అలాగే తాను నటించిన ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రొమోషనల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ లో ఘనంగా జరిగిందని సినిమా టీం చెబుతుంది కాబట్టి.. మనం కూడా జరిగింది అనుకోవాలట. అయితే, ఈ సినిమా పై నాని చాలా ధీమాగా ఉన్నాడు. “ఒక మంచి సినిమా తీస్తే ఒక ప్రౌడ్ […]

Written By: , Updated On : December 15, 2021 / 10:22 AM IST
Follow us on

Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ అంటూ నాని తనను, అలాగే తాను నటించిన ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రొమోషనల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ లో ఘనంగా జరిగిందని సినిమా టీం చెబుతుంది కాబట్టి.. మనం కూడా జరిగింది అనుకోవాలట. అయితే, ఈ సినిమా పై నాని చాలా ధీమాగా ఉన్నాడు.

Shyam Singha Roy

Shyam Singha Roy

“ఒక మంచి సినిమా తీస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తోంది. శ్యామ్ సింగ‌రాయ్ నాకు ఆ స్థాయి ఫీలింగ్‌ ఇచ్చింది. మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం ఏటిపరిస్థుతుల్లో మ‌న‌దే, మనమే ఈ క్రిస్ట‌మ‌స్ విజేతలం’ అంటూ నాని బలంగా చెప్పాడు. మరి పుష్పతో రాబోతున్న అల్లు అర్జున్ ఏమి చేయాలి ? లేక, ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య ఏమనుకోవాలి ?

Shyam Singha Roy Royal Event

Shyam Singha Roy Royal Event

అయినా, నాని స్టార్ హీరో కాదు. జస్ట్ ఒక హీరో అంతే. అంతమాత్రానికే నాని ‘మ‌న‌దే క్రిస్ట‌మ‌స్, మనమే విజేతలం’ అంటే ఎలా ? అసలు నాని ఏమి మాట్లాడాడో చూద్దాం. ‘నాకు కల్లు ఇష్టం.. అలాగే వరంగల్లు ఇష్టమే. నేను సాయి పల్లవి చేసిన సినిమా ఇది. బెటర్ రిజల్ట్ ను మీరు ఈ 24న చూడబోతోన్నారు. నాకు బాగా గుర్తు ‘ఎంసీఏ’ సినిమా. అది కూడా ఇక్కడే ఆడియో ఫంక్షన్.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అని మేము ఇక్కడకు రాలేదు. ఇక్కడ మాకు ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తోంది. దర్శకుడు రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఎందుకంటే.. ఆ సినిమా చూసి అతన్ని జడ్జ్ చేయాలని నాకు అనిపించలేదు. కానీ ఈ రోజు ఈ సినిమాను నేను చూశాను. అందుకే, నమ్మకంగా చెబుతున్నాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా అతనికి ఉంది.

Also Read: Naga Shourya: ఫుల్ ఫామ్ లో వరుస సినిమాలు చేస్తున్న నాగ శౌర్య… డబ్బింగ్ పనుల్లో మరో చిత్రం

ఇక నిర్మాత వెంకట్ బోయినపల్లిగారితో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది’ అంటూ నాని ఎప్పటిలాగే అందరినీ పొగుడుతూ పోయాడు. అయినా, గతంలో ఇదే నాని తన సినిమాల విషయంలో బోలెడు కబుర్లు చెప్పాడు. టక్ జగదీష్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది అన్నాడు. తీరా చూస్తే ఆ సినిమా సీరియల్ కన్నా దారుణంగా ఉంది.

Also Read: Balayya: మంచి కథతో వస్తే మల్టీస్టారర్​కు రెడీ అంటున్న బాలయ్య

Tags