Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఇండియా శ్రీలంక జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగానే టాస్ గెలిచిన శ్రీలంక టీమ్ మొదట బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ టీమ్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ నాలుగు పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. దాంతో ఇండియా కి మొదట్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది…ఇక గిల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి టీమ్ ఇన్నింగ్స్ ని చక్కబెడుతూ మరో వికెట్ నష్టపోకుండా భారీ స్కోర్ చేస్తూ ఇద్దరు ముందుకు దూసుకువెళ్లారు. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీమ్ కి భారీ స్కోరు అందించే దిశ గా వీళ్ళు ఇద్దరు మ్యాచ్ ని ముందుకు తీసుకెలుతూ ఒక అద్భుతమైన నాక్ ఆడారు..ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు.ఇక 8 సంవత్సరాలలో 8 సార్లు ఒక్క సంవత్సరం లో 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు…
అయితే ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ ని కోహ్లీ బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక క్యాలెండర్ ఇయర్ లో 7 సార్లు 1000 పరుగులకు పైన పరుగులు సాధించిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ పేరుమీద ఉన్న ఈ రికార్డుని ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం జరిగింది.ఇక వీళ్ళ తర్వాత సౌరవ్ గంగూలీ 6 సార్లు ఈ ఘనతను సాధించాడు.అలాగే శ్రీలంక ప్లేయర్ అయిన కుమార సంగర్కర,ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ అయిన రికి పాంటింగ్ లాంటి ప్లేయర్లు కూడా 6 సార్లు ఈ ఫీట్ ని సాధించారు…
ఇక ఇండియన్ టీమ్ ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా 4 సార్లు ఈ ఘనతను సాధించాడు…ఇక శ్రీలంక తో ఆడుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అది నిరాశ గానే మిగిలిపోయింది ఇప్పటికే ఈ మ్యాచ్ లో సచిన్ రికార్డ్ ఒకటి బ్రేక్ చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే వన్డేల్లో 49 వ సెంచరీ పూర్తి అయ్యేది దాంతో సచిన్ తో సమానమైన పొజిషన్ లో ఉండేవాడు… కానీ 88 పరుగులు చేసి ఔట్ అవ్వడం నిజం గా కోహ్లీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి…ఇక మరో ఇండియన్ ప్లేయర్ అయిన గిల్ కూడా 92 పరుగులు చేసి ఔట్ అయ్యాడు వీళ్లిద్దరూ సెంచరీ చేస్తారు అనుకుంటే ఇద్దరిలో ఒకరు కూడా సెంచరీ చేయలేకపోయారు…
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More