Salaar: సలార్… దేశంలోనే అత్యంత హైప్ ఉన్న మూవీ. ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ప్రభాస్ మూవీ. సెకండ్ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడం. కన్నడ హీరో యష్ ని కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఎక్కడికో తీసుకెళ్లాడు. అలాంటిది ప్రభాస్ వంటి గ్లోబల్ హీరోతో చేస్తున్న సలార్ అంతకు మించి ఉంటుందని సినిమా లవర్స్ లో ఒక నమ్మకం బలపడింది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల చేయాలనుకున్నారు. ఈ తేదీ ఆధారంగా యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారు.
హాట్ కేకుల్లా సలార్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ప్రీమియర్ బుకింగ్స్ తోనే సలార్ భారీ రికార్డు నమోదు చేసేలా కనిపించింది. అనూహ్యంగా సలార్ విడుదల ఆలస్యమైంది. దీంతో బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇది ఒకింత నిరాశపరిచే అంశం. కొత్త విడుదల తేదీగా డిసెంబర్ 22 ప్రకటించారు. త్వరలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. కాగా సలార్ కి సంబంధించిన ఓ న్యూస్ గూస్ బంప్స్ కలిగిస్తుంది.
ఓ ఫైట్ కోసం ఏకంగా 750 వాహనాలు వాడుతున్నారట. జీప్స్, ట్రక్స్ , ట్యాంక్స్ భారీగా ఉపయోగించారట. దాదాపు రెండు దేశాల మధ్య యుద్దాన్ని తలపించేలా భారీ యాక్షన్ సీక్వెన్స్ రోపొందించారట. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలవనుందట. హాలీవుడ్ సినిమాలకు మించి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ టీజర్ అంచనాలకు మించి ఉంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ డైనోసార్ గా అభివర్ణించాడు.
కాగా షారుఖ్ ఖాన్ డంకీతో సలార్ పోటీపడుతోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ డిసెంబర్ 21న విడుదల కానుంది. సలార్ 22న విడుదల చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.
Over 750 different vehicles including jeeps, tanks, trucks, etc were procured for the shoot of #SalaarCeaseFire as there is a lot of on-ground action in the movie. As big as any big war sequence of any Hollywood movie”. #Prabhas #SalaarCeaseFireOnDec22 #50DaysToSalaarCeaseFire… pic.twitter.com/ibn7qZIAze
— Prasad Bhimanadham (@Prasad_Darling) November 2, 2023