https://oktelugu.com/

ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇదీ: ఉత్కం‘టై’నా.. కోహ్లీ సేన  మ్యాజిక్ ఇదీ!

కరోనా సమయంలో ఐపీఎల్-2020 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గెలుపు కోసం రెండు జట్లు నువ్వా.. నేనా అని పోరాడుతున్న తీరు క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది. దుబాయ్ వేదికగా నిన్న ముంబై ఇండియన్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రితలూగించింది. తొలి నుంచి ఉత్కంఠత సాగిన మ్యాచ్ చివరికీ ‘టై’ అయి సూపర్ ఓవర్ కు దారితీసింది. Also Read: ఐపీఎల్ లో సంచలనం: చేజింగ్ లో రికార్డ్ బద్దలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 11:28 am
    kohli

    kohli

    Follow us on

    kohli
    కరోనా సమయంలో ఐపీఎల్-2020 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గెలుపు కోసం రెండు జట్లు నువ్వా.. నేనా అని పోరాడుతున్న తీరు క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది. దుబాయ్ వేదికగా నిన్న ముంబై ఇండియన్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రితలూగించింది. తొలి నుంచి ఉత్కంఠత సాగిన మ్యాచ్ చివరికీ ‘టై’ అయి సూపర్ ఓవర్ కు దారితీసింది.

    Also Read: ఐపీఎల్ లో సంచలనం: చేజింగ్ లో రికార్డ్ బద్దలు

    సూపర్ ఓవర్లో ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోయి కేవలం 7పరుగులే చేసింది. స్పల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ చివరి బంతి వరకు మ్యాచును కొనసాగించింది. చివరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టి ఆర్సీబీని విజయతీరానికి చేర్చాడు. ఇక సూపర్ ఓవర్లో ముంబై తరపున హర్దిక్ పాండ్యా.. పొలార్డ్ లు బ్యాటింగ్ దిగారు. ఆర్సీబీ తరఫున సైనీ సూపర్ ఓవర్ వేశాడు. సైనీ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు.

    సైనీ వేసిన తొలి బంతికి పొలార్డ్ ఒక్క పరుగు తీయగా.. రెండో బంతికి పాండ్యా మరో పరుగు తీశాడు. మూడో బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పోలార్డ్ ఫోర్ కొట్టగా.. ఐదోబంతికి ఔట్ అయ్యాడు. ఇక ఆరోబంతికి బై రూపం ఒక్క పరుగు వచ్చింది. దీంతో సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ కేవలం 7పరుగులే చేసింది.

    8పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన చివరి బంతి వరకు మ్యాచ్ ను కొనసాగించింది. ఆర్సీబీ తరుఫున ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగారు. వీరిద్దరు 8పరుగులను ఈజీగా రాబట్టారు. కోహ్లీ చివరి బంతికి ఫోర్ కొట్టి తనదైన శైలిలో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

    Also Read: ధోని నిస్సహాయత: రాయుడు, రైనా వస్తేనే చెన్నై సత్తా చాటగలదా..?

    సూపర్ ఓవర్ కంటే ముందు ఆర్సీబీ 201 పరుగులు టార్గెట్ ముంబైకి విధించింది. ఆరోన్ పించ్, డివిలియర్స్‌లు హాఫ్ సెంచరీలు చేయగా దూబే చివర్లో మెరుపులు మెరిపించాడు. 202లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టులో ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో మ్యాచ్‌ టై గా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయగా కోహ్లీసేన విక్టరీ కొట్టింది.