https://oktelugu.com/

కొత్త రూల్స్: రోడ్డు ఎక్కేముందు తప్పక తెలుసుకోండి

ఇప్పటివరకు బైక్‌ పైనో.. కార్‌‌లోనో వెళ్తే వెంట వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ వెంట తీసుకెళ్లే వారం కాదు. కొంత మందికి డాక్యుమెంట్లను వెంట పెట్టుకోవడం అలవాటు ఉన్నా.. మరికొంత మంది లెక్కచేసేవారు కాదు. ఇంకొంత మంది మరిచిపోతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు తాజా సవరణల ప్రకారం.. డిజి లాకర్‌‌ టెక్నాలజీని వాడుకుంటే సరిపోతుందట. ఫిజికల్‌ డాక్యుమెంట్లు చూపాల్సిన పనిలేదట. Also Read: నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్! తాజాగా.. మోటార్‌‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 / 10:02 AM IST
    Follow us on

    ఇప్పటివరకు బైక్‌ పైనో.. కార్‌‌లోనో వెళ్తే వెంట వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ వెంట తీసుకెళ్లే వారం కాదు. కొంత మందికి డాక్యుమెంట్లను వెంట పెట్టుకోవడం అలవాటు ఉన్నా.. మరికొంత మంది లెక్కచేసేవారు కాదు. ఇంకొంత మంది మరిచిపోతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు తాజా సవరణల ప్రకారం.. డిజి లాకర్‌‌ టెక్నాలజీని వాడుకుంటే సరిపోతుందట. ఫిజికల్‌ డాక్యుమెంట్లు చూపాల్సిన పనిలేదట.

    Also Read: నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్!

    తాజాగా.. మోటార్‌‌ వాహనాల చట్టం –1989 నియమ నిబంధనల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ పలు మార్పులు చేసింది. అక్టోబర్‌‌ 1 నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. అవేంటంటే.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా ట్రాఫిక్‌ అధికారి వాహనాన్ని ఆపి.. వాహన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అడిగితే డిజిటల్‌ డాక్యుమెంట్స్‌ చూపితే సరిపోతుంది. డిజిటల్‌ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉంటే ఫిజికల్‌ డాక్యుమెంట్లను అధికారులు అడగకూడదు. ఏ వాహనదారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ట్రాఫిక్‌ అధికారి రద్దు చేస్తే వెంటనే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

    ఏదైనా వాహనాన్ని ఆపి ఆ వాహన పత్రాలు, డ్రైవర్‌‌ లైసెన్స్‌ను తనిఖీ చేస్తే.. ఆ వాహన వివరాలతోపాటు తేదీ, సమయాన్ని కూడా సంబంధిత అధికారి వెంటనే ఆన్‌లైన్‌ చేయాలి. తద్వార మరో చోటకు వెళ్లినప్పుడు మళ్లీ ఇతర అధికారులు తనిఖీ చేసే ఆస్కారం ఉండదు. అప్పుడు సిబ్బంది సమయం కూడా సేవ్‌ అవుతుంది.

    Also Read: హేమంత్‌ హత్య: పోలీసులు అవంతి పేరెంట్స్‌కే ఎందుకు సపోర్ట్‌ చేశారు?

    వాహనదారులు తమ పత్రాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ డిజి లాకర్‌‌ లేదా ఎం–పరివాహన్‌లో నమోదు చేసుకోవచ్చు. వాటిని ఆన్‌లైన్‌లో సేవ్‌ చేసుకోవడం వల్ల ఫిజికల్‌ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. వాహనదారులూ ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తమ డాక్యుమెంట్లను డిజి లాకర్‌‌లో భద్రపరుచుకోండి. ట్రాఫిక్‌ పోలీసుల బాధల నుంచి బయటపడండి.