నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్!

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉన్న ఉద్యోగులే ఉద్యోగాలు కోల్పోతూ ఉండటంతో కొత్త ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. దేశంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో మోదీ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగులకు కోటి రూపాయల వరకు సెక్యూరిటీ లేని లోన్ ఇచ్చి వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు? స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా మోదీ […]

Written By: Navya, Updated On : September 30, 2020 3:16 pm
Follow us on

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉన్న ఉద్యోగులే ఉద్యోగాలు కోల్పోతూ ఉండటంతో కొత్త ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. దేశంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో మోదీ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగులకు కోటి రూపాయల వరకు సెక్యూరిటీ లేని లోన్ ఇచ్చి వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?

స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా మోదీ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. సొంతంగా వ్యాపారం చేసి ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే వారికి మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వరం అనే చెప్పాలి. 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు స్టాండప్ ఇండియా స్కీమ్ లో భాగంగా లోన్ తీసుకునే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

మోదీ సర్కార్ స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా ఔత్సాహికులు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువత, పేదలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఎస్సీ లేదా ఎస్టీ మహిళలు ఈ రుణం పొందడానికి అర్హులు. ఈ పథకానికి అర్హత పొందాలంటే ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళ వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. రుణం తీసుకునే మహిళ గతంలో ఏ బ్యాంకుకు డిఫాల్ట్ అయి ఉండకూడదు.

కొత్త ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం ఈ రుణం పొందే అర్హత కల్పిస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్టును బట్టి బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణం తీసుకున్న మహిళలు రూపే కార్డ్ ద్వారా వర్కింగ్ కేపిటల్ కింద అవసరమైన సమయంలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. స్టాండ్ అప్ ఇండియా పోర్టల్ లేదా బ్యాంకు శాఖ లేదా లీడ్ జిల్లా మేనేజర్ ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు.

Also Read : కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..