https://oktelugu.com/

Odi World Cup 2023: గిల్ కొట్టిన షాట్ కి అవాక్కయిన కోహ్లీ… వీడియో వైరల్…

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ ఓపెనర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ మొదటి బంతికి ఫోర్ కొట్టి ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ,శుభ్ మన్ గిల్ ఇద్దరు కలిసి ఇండియన్ టీమ్ భారీ స్కోరు చేయడం లో చాలా వరకు ప్రయత్నం చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2023 1:52 pm
    Odi World Cup 2023

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 358 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.ఇక శ్రీలంక టీమ్ ని ఇండియా 55 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. ఇక ఈ వరల్డ్ కప్ లో అత్యంత తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ అయిన టీమ్ గా శ్రీలంక ఒక బ్యాడ్ రికార్డ్ సంపాదించుకుంది.

    ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ ఓపెనర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ మొదటి బంతికి ఫోర్ కొట్టి ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ,శుభ్ మన్ గిల్ ఇద్దరు కలిసి ఇండియన్ టీమ్ భారీ స్కోరు చేయడం లో చాలా వరకు ప్రయత్నం చేశారు.ఇక ఈ క్రమం లోనే గిల్ 92 పరుగులు చేసి ఔట్ అవ్వగా, కోహ్లీ 88 పరుగులు చేసి ఔట్ అయ్యాడు…

    ఇక దానికి తగ్గట్టు గానే 16 వ ఓవర్లో మధుషంక వేసిన ఒక బంతిని గిల్ కొంచం ఫ్రంట్ కి వచ్చి కవర్స్ మీదుగా దానిని బౌండరీ పంపించాడు ఇక మధుషంక వేసిన కట్టర్ ని అలా ఆడటం తో నాన్ స్ట్రైకర్ లో ఉన్న కోహ్లీ అదేం షాట్ రా నాయన అన్నట్టు గా గిల్ వైపు ఆశ్చర్యం గా చూశాడు…అది చూసిన అభిమానులు కోహ్లీ హావభావాలు చూసి నవ్వుకున్నారు. ఇక ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిజానికి కోహ్లీ చాలా మంచి ప్లేయర్ ఎవరైనా ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు…

    ఇక ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఇండియన్ టీమ్ అఫిషియల్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇలాంటి క్రమం లోనే నెక్స్ట్ సౌతాఫ్రికా టీమ్ తో ఒక భారీ మ్యాచ్ కి ఇండియన్ టీమ్ సిద్దం అయింది. ఇక ఒక్క సౌతాఫ్రికాని ఓడిస్తే ఇక ఈ టోర్నీ లో ఉన్న అన్ని పెద్ద జట్ల ను ఓడించిన టీమ్ గా ఇండియన్ టీమ్ ఈ వరల్డ్ కప్ లో ఒక అరుదైన రికార్డు ను కూడా నమోదు చేసుకుంటుంది…ఇక దానితో పాటు గా ఇండియన్ టీమ్ ఈసారి కప్పు కొట్టడం పక్క అనేది మాత్రం తెలుస్తుంది…ఇక ఇండియన్ టీమ్ ప్లేయర్లు అందరు కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది…