Bigg Boss 7 Telugu: 11వ వారం ఓటింగ్ లో తారుమారైన లెక్కలు… ఆ ఇద్దరిలో ఒకరు అవుట్!

ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ ఊహించని విధంగా సాగుతుంది. ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ కి అత్యధిక ఓటింగ్ నమోదవుతుంది.

Written By: NARESH, Updated On : November 15, 2023 6:15 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లో 11 వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది.కాగా ఎప్పటిలానే కంటెస్టెంట్స్ నామినేషన్స్ మధ్య ఓ రేంజ్ లో గొడవలు పడ్డారు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి శివాజీ, పల్లవి ప్రశాంత్ తప్పించి మిగిలిన ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ లిస్ట్ చేరారు. అయితే కెప్టెన్ అయినందుకు శివాజీ .. ఒక్క ఓటు మాత్రమే పడడంతో ప్రశాంత్ ఇద్దరూ నామినేషన్ లో లేరు.

అయితే మిగిలిన ఇంటి సభ్యులు శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక రోజ్, అంబటి అర్జున్, అమర్ దీప్, అశ్విని శ్రీ నామినేట్ అయ్యారు. కాగా ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ ఊహించని విధంగా సాగుతుంది. ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ కి అత్యధిక ఓటింగ్ నమోదవుతుంది. అతను మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్ లో లేకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ యావర్ కి ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.

ఇక మిగిలిన స్థానాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అమర్ దీప్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఎవరూ ఊహించని విధంగా వీక్ కంటెస్టెంట్ రతిక థర్డ్ ప్లేస్ లో ఉంది. అశ్విని నాలుగో స్థానంలో కొనసాగుతోంది. స్ట్రాంగ్ ప్లేయర్ గా భావిస్తున్న గౌతమ్ ఐదో స్థానంలో పడిపోయాడు. ఇక అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడు. కాగా ముందు ముందు వాళ్ళ పొజిషన్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రియాంక,శోభా శెట్టి లు డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. అయితే ఓటింగ్ మొదలై ఒక్కరోజే అయింది. కాబట్టి వీళ్ళ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం చాలానే ఉంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. గత మూడు వారాలు వరుసగా మేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.