KL Rahul: ఇండియన్ టీం లో ఉన్న చాలామంది ప్లేయర్లు క్రికెట్ ఆడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ వాళ్ళ గొప్ప హృదయాన్ని కూడా చాటుకుంటారు. ఇక రీసెంట్ గా వరల్డ్ కప్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా టీం మీద 97 రన్స్ చేసి ఇండియన్ టీం గెలుపు లో కీలక పాత్ర వహించిన కె ఎల్ రాహుల్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం లో కీలక ప్లేయర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒక పేద విద్యార్థి కి ఆర్థిక సాయం చేసి తన మానవత్వాన్నికూడా చాటు కున్నాడు…ఇక వివరాల్లోకి వెళ్తే ధార్వాడ లోని సిద్దేశ్వర్ కాలనీ కి చెందిన హనుమంతప్ప, సుమిత్ర దంపతుల కుమార్తె అయిన సృష్టి.భవిష్యత్తు లో డాక్టర్ కావాలనుకుంటుంది.కానీ మొదట్లోనే పేదరికం అనేది అడ్డంకి గా మారడం తో ఆమె కలలు మధ్యలోనే ఆగిపోకూడదని ప్రముఖ సామజిక కార్యకర్త మంజునాథ్ హేబాసురు ఈ విషయాన్ని రాహుల్ దృష్టి కి తీసుకెళ్లాడు.దాంతో ఆయన వెంటనే స్పందిస్తూ ఆ అమ్మాయి చదువుకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాడు…
దీపికా గాంకర్, అనిత గాంకర్ నేతృత్వం లో 1996 లో స్థాపించిన గ్లోబల్ ఎక్స లెన్స్ స్కూల్ లో ఆ పాప చదువుకి ఆక్వాల్సిన డబ్బులను ఇచ్చి ఆర్థికం గా ఆమెని ఆయన ఆదుకోవడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాలా శ్రీ నయ్యర్ ఈ విషయం మీద మాట్లాడుతూ రాహుల్ గారు ఇలాంటి హెల్ప్ చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాడు…ఇక ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చాలా మంది రాహుల్ అభిమానులు నువ్వు ఇంకా చాలా మంది కి సహాయం చేయాలన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.నిజానికి ఈయన చేసిన సహాయం ఆ అమ్మాయి కి చాలా గొప్పది ఎందుకంటే ఆమె డాక్టర్ కావాలని అనుకున్నప్పుడు ఆమెకి వెన్ను తట్టి వెనక నిలవాలి అనే ఉద్దేశ్యం తోనే రాహుల్ తనకి హెల్ప్ చేసినట్టు గా కూడా తెలుస్తుంది…
ఇక రాహుల్ ప్రస్తుతం ఇండియన్ టీం లో కీలక ప్లేయర్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఇలాంటి సమయం లో ఒక ఆడపిల్ల చదువుకి కారణం అయినందుకు ఆయనని అందరు అభిమానిస్తున్నారు.ఇక ఆయన లానే చాలా మంది క్రికెటర్లు చదువుకునే పిల్లలకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు మాయం అవుతుంది అని చెప్తున్నారు.అయితే రాహుల్ కొద్దీ రోజుల కిందట గాయం కారణం గా కొద్దీ రోజులు మ్యాచులు ఆడలేకపోయాడు కానీ ఇప్పుడు తన వంతు గా తాను మ్యాచ్ ఆడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు…
ఇక రాహుల్ ఐసీసీ నిర్వహిస్తూన్న వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఆయన పాత్ర చాలా కీలకం గా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఎందుకంటే ఇండియన్ టీం అనేది ఫైనల్ కి వెళ్తుంది.కాబట్టి ఫైనల్ లో కూడా విజయ ఢంకా మోగిస్తుంది.ఇక ఇలాంటి టైం లో ఆయనకి కూడా ఈ ట్రోఫీ మొత్తం లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక దానికి తగ్గట్టు గానే ఇండియన్ టీం లో ఆయన ప్లేస్ మీద మొన్నటి దాక ఒక చిన్నపాటి సందేహం అయితే ఉండేది.ఎందుకంటే ఆయన టీం లో ఉంటాడా లేదా అనేది క్లారిటీ గా తెలిసేది కాదు.కానీ గత 4 , 5 మ్యాచ్ ల నుంచి ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయన్ని ఆపేవాడు ఎవరు లేరు అనేలా దూసుకెళ్తున్నాడు…