KL Rahul : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్.. కాసులు కురిపించే టోర్నీగా మారింది. క్రికెట్ ను రిచ్ గేమ్ ను చేసిన ఘనతను సొంతం చేసుకుంది. అలాంటి ఐపీఎల్ లో కార్పొరేట్ కంపెనీలు జట్లకు యజమానులుగా కొనసాగుతున్నాయి. టికెట్ల ధరలు.. వాణిజ్య ప్రకటనలు.. ఇతరత్ర మార్గాల ద్వారా ఆదాయాలు వస్తుంటాయి. మొత్తంగా చూస్తే యాజమాన్యాలకు ఏ విధమైన నష్టం ఉండదు. పైగా పెట్టుబడి పెట్టిన ప్రతి పైసాకు రిటర్న్ వస్తుంది. కేవలం డబ్బులు.. ఇతర హోదాల కోసం మాత్రమే ఐపీఎల్లో కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. కార్పొరేట్ కంపెనీలు తాము పెట్టిన పెట్టుబడికి లాభాలు ఆశిస్తాయి కాబట్టి.. ప్రతి విషయాన్ని లెక్కలు వేసుకుంటాయి. ఇందులో అన్ని కంపెనీలు ఒకే విధంగా ఆలోచిస్తుంటాయి.. ఐపీఎల్ లో గెలిచిన జట్టు బ్రాండ్ విలువ పెరుగుతుంది. తద్వారా యాజమాన్యానికి భారీగా డబ్బులు వస్తుంటాయి. అందువల్లే ఐపిఎల్ లో తమ జట్టు విజేతగా నిలవాలని ప్రతి యాజమాన్యం కోరుకుంటుంది. ఈ కోరిక సానుకూలంగా ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఆటగాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తేనే అసలు సమస్య ఎదురవుతుంది.
Also Read : కేఎల్ రాహుల్ కూతురు పేరులో అంత అర్థం ఉందా?
దిమ్మ తిరిగిపోయింది
ఐపీఎల్ లో పది జట్లు ఉన్నాయి. ఈ పది జట్లను రకరకాల కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి.. లక్నో జట్టుకు ప్రమోటర్ గా సంజీవ్ గోయెంకా వ్యవహరిస్తున్నాడు.. లక్నో జట్టు వ్యవహారాలలో ప్రతి దాంట్లో సంజీవ్ వేలు పెడుతుంటాడు. అది ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తోంది. గత సీజన్లో లక్నో, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఏకపక్ష విజయం సాధించింది. ఆ సమయంలో మైదానంలో సంజీవ్ ఉన్నాడు. తన పక్కనే ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్ ను చెడా మడా తిట్టాడు. అది కాస్త కేఎల్ రాహుల్ కు ఇబ్బంది కలిగించింది. సంజీవ్ వ్యవహార శైలిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ క్రమంలో జట్టును వీడి వెళ్లిపోవాలని సంజీవ్ నాడు నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తన మనోగతాన్ని వెల్లడించాడు. ఇక సంజీవ్ కూడా టెంపరి తనం ప్రదర్శించడంతో.. కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. అతడిని ఢిల్లీ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను సంజీవ్ కొనుగోలు చేశాడు. ఏకంగా లక్నో జట్టుకు సారధిని చేశాడు. కానీ సంజీవ్ ఊహించిన ఫలితం రాలేదు. పైగా సొంతమైదానంలో లక్నో ఓడిపోతోంది. దీనికి తోడు భారీ అంచనాలు పెట్టుకున్న రిషబ్ పంత్ 0 పరుగులకు వెను తిరిగి వస్తున్నాడు.. అందుకే పైసలతో కొవ్వెక్కి కొట్టుకోకూడదు. ఆటను ఆట మాదిరిగానే చూడాలి.. అప్పుడే అసలు మజా దక్కుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : కేఎల్ రాహుల్ పంచ్ అదిరింది.. సంజీవ్ గోయంకా కు దిమ్మతిరిగింది: వీడియో వైరల్
KL Rahul walking away from Goenka
Absolute Cinema ❤️#LSGvsDC #KLRahulpic.twitter.com/28QpmZnBJR
— Pan India Review (@PanIndiaReview) April 22, 2025