KL Rahul : లక్నో జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో అటు బ్యాట్, ఇటు బాల్ తో ఢిల్లీ జట్టు అదరగొట్టింది. సొంత గడ్డపైనే లక్నో జట్టు ను మట్టి కరిపించింది. ఈ విజయం తర్వాత ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.. దీంతో సంజీవ్ కు చుక్కలు కనిపించాయి.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు సారధిగా ఉన్నాడు. అయితే రాహుల్ ఆ సమయంలో అత్యుత్తమమైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దీనికి తోడు లక్నో జట్టు ప్రతి మ్యాచ్లో తడబడింది. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో దారుణమైన ప్రదర్శన చేయడంతో .. మైదానంలోనే కేఎల్ రాహుల్ పై సంజీవ్ గోయంక ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు కెప్టెన్ ను సంజీవ్ అలా నిలదీయడంపై అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సంజీవ్ తన తీరు మార్చుకోలేదు. మెగా వేలంలో రాహుల్ ను పక్కన పెట్టాడు. రిషబ్ పంత్ ను 27 కోట్లకు కొనుగోలు చేశాడు. అంతేకాదు తన జట్టుకు సారధిని చేశాడు. అయితే పంత్ దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ విఫలమవుతున్నాడు.. ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఏడవ స్థానంలో వచ్చినప్పటికీ.. సున్నా పరుగులు చేశాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 42 బంతుల్లో మూడు ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
Also Read : కేఎల్ రాహుల్ కూతురు పేరులో అంత అర్థం ఉందా?
ముఖం మాడిపోయింది
కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ నేపథ్యంలో.. అతనిపై అభినందనలు కురుస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ ను అందరూ అభినందించారు. ఈ జాబితాలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంక, అతని కుమారుడు కూడా రాహుల్ ను అభినందించిన వారిలో ఉన్నారు. అయితే సంజీవ్ తో కరచాలనం చేస్తూనే.. వారి మాటలు పట్టించుకోకుండా.. వారిని కనీసం చూడకుండా అక్కడి నుంచి సంజీవ్ వెళ్ళిపోయాడు. దీంతో సంజీవ్, అతడి ముఖం పూర్తిగా మాడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ” దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పాడు.. తనను అవమానించిన సంజీవ్ కు సరైన స్థాయిలో పాఠం చెప్పాడు. అవమానిస్తే ఎవడైనా సరే ఇలానే సమాధానం చెబుతాడని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : కేఎల్ రాహుల్ రివెంజ్ వెనుక.. అసలు కథ ఇదా
KL Rahul walking away from Goenka
Absolute Cinema ❤️#LSGvsDC #KLRahulpic.twitter.com/28QpmZnBJR
— Pan India Review (@PanIndiaReview) April 22, 2025