BJP Leader : ఏపీ ( Andhra Pradesh) నుంచి ఖాళీ అయిన రాజ్యసభ పదవికి సంబంధించి రకరకాల చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కూటమికి సంపూర్ణ బలం ఉండడంతో దానికే రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ పదవిని బిజెపి కోరుకుంటుంది. అయితే నిన్నటి వరకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీకి చెందిన బిజెపి మహిళా నేత స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలకు ఏపీ కోటాను ఎలా కేటాయిస్తారని రాష్ట్ర బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : మందు కొడుదామా..? వస్తావా? మహిళతో ఏపీ బీజేపీ నేత వీడియో వైరల్*
* బిజెపి కి ఛాన్స్..
ఏపీలో కూటమి( Alliance ) ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలో ఈ కూటమి నడుస్తుండగా బిజెపి, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. నామినేటెడ్ పదవుల నుంచి ఎమ్మెల్సీ పదవులు దాకా మూడు పార్టీలు పంచుకుంటున్నాయి. అయితే రాజ్యసభ పదవుల విషయంలో మాత్రం బిజెపి తమకు సింహభాగం ప్రయోజనాలు కావాలని కోరుతోంది. మొన్నటికి మొన్న మూడు రాజ్యసభ పదవులను భర్తీ చేసిన సమయంలో.. చివరి నిమిషంలో బిజెపికి ఒక పదవి కేటాయించాల్సి వచ్చింది. అదే సమయంలో జనసేన త్యాగం చేసింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇది కూడా తమకే కేటాయించాలని బీజేపీ బలంగా కోరుతోంది. మొన్న ఆ మధ్యన అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ఇదే విషయం కోరడంతో సీఎం చంద్రబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పవన్ సైతం బిజెపి డిమాండ్ ను ఒప్పుకున్నట్లు సమాచారం.
* ప్రముఖంగా అన్నామలై పేరు..
తొలుత తమిళనాడు బిజెపి మాజీ ప్రెసిడెంట్ అన్నామలై( Annamalai) పేరు ప్రముఖంగా వినిపించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తమిళనాడులో పట్టు సాధించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఇంకోవైపు విజయ్ టీవీ కే పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో బిజెపి బలపడాలంటే అన్నామలైకు కీలక బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. అందుకే ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి.. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని బిజెపి పెద్దలు భావించారు. ఏపీ నుంచి అన్నామలైను ఎంపిక చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
* రాహుల్ గాంధీని ఓడించి..
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి స్మృతి ఇరానీ( Smriti Irani ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీకి చెందిన ఈమె గత కేంద్ర క్యాబినెట్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్లోని అమేది లోక్సభ నియోజకవర్గ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు స్మృతి ఇరానీ. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మాత్రం రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించి తనకంటూ ఉనికి చాటుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయేసరికి.. ఢిల్లీ సీఎం రేస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ నుంచి ఆమెను రాజ్యసభకు పంపించి మంత్రిని చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నామలై కానీ.. స్మృతి ఇరానీ కానీ.. ఏపీ నుంచి రాజ్యసభ పదవి దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : ఏపీ బీజేపీ నేతలకు ఏమైంది? పక్క రాష్ట్రం వారు స్పందిస్తున్నారేంటి?