Jio : రిలయన్స్ జియో వినియోగదారులకు ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. జియో కేవలం రూ. 895కే 336 రోజుల అన్ లిమిటెడ్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు ఎక్కువ వ్యాలిడిటీ కోసం భారీగా ఛార్జ్ చేస్తుంటే జియో మాత్రం తక్కువ ధరకే వినియోగదారులను ఆకట్టకుంటుంది. ఈ రూ. 895 ప్లాన్‌తో లభించే ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Also Read : మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..
జియో ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే!
రూ. 895 విలువైన జియో ప్రీపెయిడ్ ప్లాన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మై జియో యాప్‌లో అందుబాటులో ఉంది. అందులో ఈ రీఛార్జి ప్లాన్ సెలక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో జియో తన కోట్ల మంది వినియోగదారులకు 28 రోజుల పాటు 2 జీబీ డేటాను అందిస్తుంది. ఇలా 12 సార్లు అంటే దాదాపు ఏడాది పొడవునా మీకు ఆ డేటా లభిస్తుంది. ఈ డేటాను పూర్తిగా ఉపయోగించే వరకు హై-స్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది.
ఈ లెక్కన చూస్తే ఈ ప్లాన్‌తో మీరు మొత్తం 24 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. డేటాతో పాటు రూ. 895 రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్ 28 రోజుల పాటు 50 SMSలను కూడా అందిస్తుంది.
జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్
జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రూ. 895 ప్లాన్ జియో ఫోన్ విభాగంలో మీకు కనిపిస్తుంది. ఎక్స్ ట్రా బెనిఫిట్స్ విషయానికి వస్తే ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌కు కూడా ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ ప్రయోజనాలను జియో ఫోన్ ఉపయోగించే వారు మాత్రమే పొందగలరు.
ఎయిర్‌టెల్-వీఐ ప్లాన్స్
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌కు పోటీగా ప్రస్తుతం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) దగ్గర అలాంటి చౌకైన, ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ఏదీ లేదు. భవిష్యత్తులో ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారుల కోసం ఇలాంటి చౌకైన ప్లాన్‌లను లాంచ్ చేస్తాయో లేదో చూడాలి. మొత్తానికి జియో తన వినియోగదారులకు బెస్ట్ ఆఫర్‌లను అందించడంలో పోటీ కంపెనీల కంటే ముందుంది.
Also Raed : జియో అదిరిపోయే ఆఫర్.. 50 రోజులపాటు ఉచిత సేవ !
