KKR Vs SRH: ఈ రెండు జట్ల ఐపీఎల్ ఫైనల్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

కోల్ కతా 2024 సీజన్ తో సహా నాలుగు సార్లు ఐపీఎల్ ఫైనల్ వెళ్ళింది. ప్రస్తుతం కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 4:13 pm

KKR Vs SRH

Follow us on

KKR Vs SRH: లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్ కతా, హైదరాబాద్.. ఫైనల్ పోరు లోనూ తలపడనున్నాయి. లీగ్, ప్లే ఆఫ్ దశలో ఈ రెండు జట్లు తలపడగా.. రెండుసార్లూ కోల్ కతా విజయం సాధించింది. మే 21న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్ కతా హైదరాబాద్ పై విజయాన్ని నమోదు చేసింది. దర్జాగా ఫైనల్లోకి వెళ్ళింది.. లీగ్ దశలో రెండవ స్థానం పొందిన కారణంగా ఫైనల్ వెళ్లేందుకు హైదరాబాద్ జట్టుకు మరో అవకాశం లభించింది. రాజస్థాన్ జట్టుతో ఆడిన మ్యాచ్లో గెలవడం ద్వారా హైదరాబాద్ ఫైనల్ వెళ్ళింది. శుక్రవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించడంతో, నేరుగా ఫైనల్ వెళ్ళింది.. ఆదివారం ఈ రెండు జట్లు చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్లో చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ లో తల పడనున్న నేపథ్యంలో ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే..

కోల్ కతా 2024 సీజన్ తో సహా నాలుగు సార్లు ఐపీఎల్ ఫైనల్ వెళ్ళింది. ప్రస్తుతం కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది.. 2012లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్ కతా తొలిసారి ఐపిఎల్ విజేతగా ఆవిర్భవించింది. 2014లోనూ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్ కతా ఐపీఎల్ దక్కించుకుంది. 2021లో ఫైనల్ వెళ్ళినప్పటికీ.. కప్ గెలుచుకోలేకపోయింది. అప్పుడు కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో కోల్ కతా ఫైనల్ వెళ్ళింది. లీగ్, ప్లే ఆఫ్ దశలో హైదరాబాద్ జట్టును ఓడించిన కోల్ కతా.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే ఒరవడి కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.. కచ్చితంగా కప్ గెలుస్తామని చెబుతున్నారు.

ఇంకా హైదరాబాద్ రెండుసార్లు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధించింది. 2009లో గిల్ క్రిస్ట్ సారధ్యంలో ఫైనల్ వెళ్ళింది. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచి టోపీ అందుకుంది. 2016లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సారధ్యంలో ఫైనల్ వెళ్లిన హైదరాబాద్ జట్టు.. ఈసారి కూడా బెంగళూరు ను ఓడించి కప్ దక్కించుకుంది.. 2009, 2016 తర్వాత.. 2018 లోనూ ఫైనల్ వెళ్ళింది. కెన్ విలియంసన్ సారధ్యంలో హైదరాబాద్ జట్టు చెన్నై చేతిలో ఓడిపోయింది. 2024లో హైదరాబాద్ ఫైనల్ వెళ్ళింది.. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. లీగ్, ప్లే ఆఫ్ దశలో కోల్ కతా జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే శుక్రవారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జట్టును అన్ని రంగాల్లో ముందుండి నడిపాడు. ఫలితంగా హైదరాబాద్ ఫైనల్ వెళ్ళింది. మూడోసారి ఐపీఎల్ కప్ దక్కించుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.