PM Modi: ‘వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం తాను 2047 వరకు 24 గంటలు పని చేసేలా దేవుడు తనను నియమించాడు. దేవుడు నాకు మార్గం చూపిస్తాడు. దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. లక్ష్యాన్ని సాధిస్తానన్న నమ్మకం ఉంది’ అని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
400 సీట్లు ప్రజల నినాదం
ఈ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ నినాదం కాదని, అది ప్రజల నినాదమని మోదీ అన్నారు. ఐదేళ్ల పాలనతో తనకు కూడా ఆ నమ్మకం ఉందన్నారు. ఇక నెహ్రూ గురించి అడిగిన ప్రశ్నకు 2014 నుంచి తన హయాంలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందనేది పోచ్చి చూడాలని కోరారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తాను ఏడుసారుల ఎన్నికవుతానని వెల్లడించారు.
మళ్లీ బీజేపీదే అధికారం..
ఈ ఎన్నికల్లో బీజేపీ సులభంగా గెలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రీపోల్ సర్వేలు కూడా ఇదే తెలిపాయి. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. జూన్ 4న అంచనాలు నిజమైతే నరేంద్రమోదీ కాంగ్రెస్ ఐకాన్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేస్తారు. వరుసగా మూడుసార్లు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు. గతంలో జవహర్‌లాల్ నెహప్రూ 1947 నుంచి 1964 వరకు మూడుసార్లు ప్రధాని అయ్యారు. దేశాన్ని పాలించిన భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఆయనే. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోదీ ఆ రికార్డు సమం చేస్తారు.