Yogendra Yadav: ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడి జోస్యం.. గెలుపు ఎవరిదంటే?

మరోవైపు అంతర్గతంగా సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెఫాలజిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై విశ్లేషిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 25, 2024 4:37 pm

Yogendra Yadav

Follow us on

Yogendra Yadav: జాతీయస్థాయిలో అందరి చూపు ఇప్పుడు ఏపీ వైపు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడమే అందుకు కారణం. పోలింగ్ నాడు, పోలింగ్ తరువాత హింసాత్మక ఘటనలు జరగడం కూడా జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఏపీ రాజకీయాల వైపు అందరూ చూస్తున్నారు. ఏపీలో ఎవరు గెలుపొందుతారో ఆరా తీస్తున్నారు. మరోవైపు గెలుపు మాదంటే మాది అంటూ అధికార వైసిపి, ఇటు టిడిపి కూటమి ధీమాతో ఉన్నాయి. పోలింగ్ కు, కౌంటింగ్ కు మూడు వారాల గ్యాప్ ఉండడంతో ఉత్కంఠ పెరుగుతోంది. భారీ స్థాయిలో బెట్టింగులకు కారణమవుతోంది.

మరోవైపు అంతర్గతంగా సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెఫాలజిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఏపీ ఎన్నికలపై స్పందించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ కూటమిదే గెలుపు అని తేల్చి చెప్పారు. అధికార వైసీపీకి ఏపీ ప్రజలు షాక్ ఇస్తారని కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరో విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయంతో విభేదించారు. ఎన్నికల విశ్లేషకుడిగా పేరొందిన యోగేంద్ర యాదవ్ జాతీయస్థాయిలో బిజెపికి అనుకున్న స్థాయిలో సీట్లు రావని తేల్చారు. తప్పకుండా ఆ పార్టీ మిత్రుల సాయాన్ని అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. కేవలం మిత్రుల సాయంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని అభిప్రాయపడ్డారు.

ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఫలితాలపై విశ్లేషించారు. ఎన్డీఏ కూటమి 15 పార్లమెంట్ స్థానాలను దక్కించుకునే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. బిజెపి మూడు స్థానాల్లో గెలుస్తుందని కూడా జోష్యం చెప్పారు. వైసీపీకి పది వరకు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ తేల్చి చెప్పడం విశేషం. ఈ లెక్కన ఎన్డీఏ కూటమికి 105 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. మొత్తానికైతే అటు మెజారిటీ సర్వేలు సైతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ విశ్లేషకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.