Chennai Super Kings : బలమైన ముంబై జట్టును అంతే బలంగా ఢీ కొట్టింది. బెంగళూరు జట్టుకు అనేక సందర్భాల్లో బెంగ మిగిల్చింది. ఇక హైదరాబాద్, కోల్ కతా, పంజాబ్, లక్నో.. ఇలా చెప్పుకుంటూ పోతే మేటి జట్లను సైతం పడుకోబెట్టింది. గర్వాన్ని ప్రదర్శించిన గుజరాత్ జట్టుకు కన్నీళ్లు మిగిల్చుతూ 2023లో ఐపిఎల్ టోర్నీ అందుకుంది. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో సంచలన విజయాలు సాధించి.. అనితర సాధ్యమైన జట్టుగా ఆవిర్భవించింది చెన్నై సూపర్ కింగ్స్. గతమెంతో ఘనం.. నేడు మాత్రం అత్యంత అధ్వానం ఉన్నట్టుగా సాగుతోంది ఆ జట్టు తీరు. ముఖ్యంగా ఈ సీజన్లో చెన్నై జట్టు ఆట తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివరికి ధోని సారధిగా ఉన్నప్పటికీ చెన్నై రాత మారడం లేదు. చెన్నైకి ఓదార్పు విజయం కూడా తగ్గడం లేదు. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ చెన్నై జట్టు అనామక జట్టు లాగా ఆడుతుండడం.. ఆ జట్టు అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నై జట్టు కేవలం రెండంటే రెండు విక్టరీలను సొంతం చేసుకోవడం..ఆ జట్టు ఆటగాళ్ల నిర్లక్ష్యాన్ని ప్రధానంగా ఎత్తిచూపిస్తోంది.
Also Read : ప్రభ్ సిమ్రాన్ సింగ్.. పంజాబ్ బాహుబలి.. ఓపెనర్ అంటే నీలా ఆడాలి..
దారుణాతీదారుణం
2008 నుంచి ఐపీఎల్ లో చెన్నై జట్టు ఆడుతోంది. దాదాపు పదిసార్లు ఫైనల్ వెళ్ళింది. ఇందులో ఐదుసార్లు విజేతగా నిలిచింది. బహుశా ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా సాధించలేని గణాంకాలను చెన్నై జట్టు సొంతం చేసుకుంది. ఐతే ప్రస్తుత ఐపీఎల్ లో అత్యంత దారుణమైన పరిస్థితిని చెన్నై జట్టు ఎదుర్కొంటోంది.. సరిగ్గా 2020 సీజన్లో ఆరంటే ఆరు విజయాలతోనే చెన్నై జట్టు గ్రూప్ దశ నుంచి వెళ్లిపోయింది. 2022లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి గ్రూప్ దశనుంచే నిష్క్రమించింది. ఈ సీజన్లో చెన్నై జట్టు 9 మ్యాచులు ఆడి.. కేవలం రెండిట్లో మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. చెన్నై జట్టు దాదాపు ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది. చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. కానీ ప్రస్తుత ఐపీఎల్ లో అలా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా చరిత్రలో తొలిసారిగా అత్యంత దారుణమైన స్థితిని చెన్నై జట్టు ఎదుర్కొంటోంది. ధోని నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఇలా జరగడం సగటు చెన్నై జట్టు అభిమానికి రుచించని పరిస్థితి నెలకొంది.
View this post on Instagram