KKR Vs DC: ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అటు ఢిల్లీ జట్టుకు..ఇటు కోల్ కతా నైట్ రైడర్స్ కు అత్యంత ప్రాధాన్యమైనది… ఈ మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత పటిష్టమవుతాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఊహించని స్థాయిలో ఓటమి ఎదుర్కొంది. ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఒకవేళ గనుక కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోతే ఢిల్లీ జట్టు అయిదవ స్థానానికి పరిమితం అవుతుంది. అప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పరిస్థితిని అక్కడిదాకా తీసుకురాకముందే ఢిల్లీ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలని భావిస్తున్నది. సొంత గ్రౌండ్ ను అడ్వాంటేజ్ గా తీసుకొని అదరగొట్టాలని ఢిల్లీ జట్టు యోచిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సత్తా చాటి కోల్ కతా ను బీట్ చేయాలని బలంగా కోరుకుంటున్నది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే బెంగళూరు ను పక్కనపెట్టి.. టాప్ స్థానంలోకి వెళ్తోంది.
Also Read: వైభవ్ సూర్యవంశీ కంటే ముందు.. క్రికెట్ లో “పది యువ” అద్భుతాలు వీరు!
ఈ మ్యాచ్ ఓడిపోతే..
ఇక ఈ మ్యాచ్ ఓడిపోతే కోల్ కతా కు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోతాయి. ఈ జట్టు గత ఏడాది విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ సీజన్లో మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ ఆ స్థాయిలో రాణించలేకపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత బలంగా ఉన్నప్పటికీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నది. సునీల్ నరైన్, రహానే, వంటి వారు తేలిపోతున్నారు. కీలకమైన సమయాలలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వికెట్లు పడేసుకుంటున్నది. బౌలర్లు కూడా పకడ్బందీగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. వికెట్లు పడగొట్టలేకపోతున్నారు. అది ప్రత్యర్థి జట్లకు వరంలాగా మారుతున్నది. కోల్ కతా నైట్ రైడర్స్ వరుస ఓటములు ఎదుర్కొని.. ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేస్తుంది.. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన కోల్ కతా.. ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది.. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు కోల్ కతా, ఢిల్లీ జట్లు 35 సార్లు పరస్పరం తలపడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ 18 సార్లు.. ఢిల్లీ క్యాపిటల్స్ 15 సార్లు విజయాలు సాధించాయి. రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. మొత్తంగా చూస్తే కోల్ కతా కు కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం కోల్ కతా పై విజయం సాధించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. మరోవైపు కోల్ కతా కూడా ఈ మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది. ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని యోచిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో జట్టుకూర్పులో కోల్ కతా యాజమాన్యం కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: సూపర్ సెంచరీ.. నాన్నకు వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన కానుక..