Khalil Ahmed : ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో చెన్నై జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మద్ ఉన్నాడు. ఇతడు ఏడు మ్యాచ్లలో 12 వికెట్లు సాధించాడు.. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లు వేసి.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తనకు వద్దని.. నూర్ అహ్మద్ కు ఇవ్వాలని మహేంద్ర సింగ్ ధోని కోరాడు అంటే.. అతడు ఏ విధంగా బౌలింగ్ చేసాడో అర్థం చేసుకోవచ్చు. నూర్ అహ్మద్ ప్రస్తావన కాస్త వదిలేస్తే.. ఐపీఎల్ లో టెర్రి పిక్ బౌలర్ల లిస్ట్.లో చెన్నై జట్టుకే చెందిన ఖలీల్ అహ్మద్ బౌలర్ల విభాగంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
Also Read : ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన యజువేంద్ర చాహల్
తొలి బౌలర్ గా..
ఐపీఎల్ లో సాధారణంగా బౌలర్లు ఎక్కువ ఎకనామి రేట్లను నమోదు చేస్తారు. కారణం పిచ్ లు అంతగా బౌలర్లకు సహకరించవు. పైగా పరుగులు రాబట్టడానికి బ్యాటర్లు చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో బ్యాటింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఎంతటి తోపు బౌలర్లు అయినా సరే బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇందులో ఖలీల్ అహ్మద్ మాత్రం భిన్నంగా బౌలింగ్ చేస్తున్నాడు.. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 11 వికెట్లు పడగొట్టాడు. ఇతడు ఎకనామీ రేటు 9.00 గా నమోదయింది. ఉత్తమ ప్రదర్శన 29/3 గా ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఖలీల్ అహ్మద్ 27 ఓవర్లు వేశాడు. ఇందులో 78 డాట్ బాల్స్ వేశాడు. బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, కమిన్స్ లాంటి హేమా హేమి బౌలర్లు కూడా నమోదు చేయడానికి ఘనతను ఖలీల్ అహ్మద్ తన ఖాతాలో వేసుకున్నాడు. 27 ఓవర్లలో 78 డాట్ బాల్స్ వేశాడంటే అతడు ఏ స్థాయిలో బౌలింగ్ వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో లీగ్ మ్యాచ్లలో ప్రతి డాట్ బాల్ కు 18 మొక్కల చొప్పున నిర్వాహక కమిటీ నాటనుంది. ఈ లెక్కన ఖలీల్ అహ్మద్ వల్ల ఐపీఎల్ నిర్వాహక కమిటీ తనవంతు బాధ్యతగా 1,404 మొక్కలకు పుడమి పై ప్రాణం పోస్తుంది. లక్నో జట్టుపై ఆడినట్టుగానే.. మీతో మ్యాచుల్లో గనక ఆడితే ప్లే ఆప్స్ కు చెన్నై జట్టు వెళ్తే.. అక్కడ కూడా ఖలీల్ అహ్మద్ దుమ్ము రేపే లెవెల్ లో బౌలింగ్ కనక చేస్తే అప్పుడు డాట్ బాల్ కు ఐపీఎల్ నిర్వాహక కమిటీ 500 మొక్కల చొప్పున నాటనుంది. ఈ లెక్కన చెన్నై జట్టుకు మాత్రమే కాదు.. పర్యావరణ హితానికి కూడా ఖలీల్ అహ్మద్ తన వంతుగా కృషి చేస్తున్నాడు.. ఇంకా ప్రస్తుత చెన్నై జట్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కంటే నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ద్వయం గొప్పగా బౌలింగ్ చేస్తోంది. వీరిద్దరే ఇప్పటివరకు 23 కంటే ఎక్కువ వికెట్లు సాధించడం విశేషం.
Also Read : ఆరు మ్యాచ్ లు.. 5 వికెట్లు.. ఏంది షమీ భయ్యా ఇదీ..