Prabhas : ఒకప్పుడు ఏడాదికి మన స్టార్ హీరోల నుండి కచ్చితంగా ఒక్క సినిమా విడుదల అయితే ఉండేది. ఆరు మంది స్టార్ హీరోలు ఉన్న ఈ ఇండస్ట్రీ లో కనీసం నలుగురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏడాదికి ఒక్క స్టార్ హీరో సినిమా విడుదల అవ్వడమే గగనం అయిపోతుంది. థియేటర్స్ లో మనీ రొటేషన్ జరగక మూతలు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కచ్చితంగా రామ్ చరణ్(Global Star Ram Charan), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రభాస్(Rebel Star Prabhas) వంటి స్టార్ హీరోల నుండి సినిమాలు వస్తాయని అనుకున్నారు ట్రేడ్ పండితులు. రామ్ చరణ్ నుండి అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ నుండి కూడా ఒక సినిమా విడుదల అవుతుంది కానీ, ఎప్పుడు విడుదల అవుతుంది అనేది నిర్మాతలకు కూడా తెలియదు పాపం.
Also Read : రామ్ చరణ్ ని అవమానించిన తమన్నా..కనీసం గుర్తించలేదంటూ అభిమానులు ఫైర్!
ఇదే సమస్య ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా జరుగుతుంది. ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుండి ‘రాజా సాబ్’ చిత్రం వెంటనే విడుదల అవుతుందని అనుకున్నారు. ఎందుకంటే ఈ ‘కల్కి’ చిత్రం తో పాటుగా ఈ సినిమా షూటింగ్ ని కూడా ప్రభాస్ సమాంతరంగా మొదలు పెట్టాడు. నిర్మాతలు 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది, ఏప్రిల్ 10 న విడుదల చేసేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. VFX వర్క్ పై ప్రభాస్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం తో మళ్ళీ రీ వర్క్ చేయిస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ ఈ సినిమా కోసం ఈ ఏడాది ఒక్క రోజు కాల్ షీట్ కూడా ఇవ్వలేదట. ఈ ఏడాది ఆయన కేవలం హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నాడట.
‘రాజా సాబ్’ సినిమా పూర్తి అవ్వాలంటే ప్రభాస్ 45 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలి. కొంత టాకీ పార్ట్ బ్యాలన్స్ ఉండడంతో పాటు, రీ షూట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఫలితంగా ఈ చిత్రం ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమే. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్, ఈ ఏడాది ని ఖాళీగా ఉంచబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు కానీ, అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందట. మరోపక్క సందీప్ వంగ తో చేయబోయే ‘స్పిరిట్’ చిత్రాన్ని ఈ ఏడాది మొదలు పెట్టే అవకాశాలే లేవట. సందీప్ వంగ ఈ చిత్రాన్ని 120 వర్కింగ్ డేస్ లో పూర్తి చెయ్యాలని, అందులో ప్రభాస్ 90 రోజులు పని చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ వరకు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read : మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టిన అలేఖ్య చిట్టి..వైరల్ అవుతున్న వీడియో!