Joe Root : రెండో టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ వరుసగా రెండవ సెంచరీ సాధించాడు.. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ లో 206 బంతుల్లో 143 రన్స్ చేశాడు రూట్. ఒకానొక దశలో 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్ ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ భారాన్ని వంటి చేత్తో మోసాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 121 బంతులను ఎదుర్కొన్న అతడు 103 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన నాలుగవ బ్యాటర్ గా రూట్ చరిత్ర సృష్టించాడు.. జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు మైకేల్ వాన్ 2004లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేశాడు.. మైఖేల్ వాన్ కంటే గ్రాహం గూచ్(1990), జార్జ్ హ్యాడ్లీ(1939) ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. హ్యాడ్లీ తర్వాత 2004లో మైకేల్ వాన్ ఈ చరిత్ర సృష్టించాడు. మైకేల్ వాన్ అనంతరం 20 ఏళ్ల తర్వాత రూట్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఇదే తొలిసారి
టెస్ట్ కెరియర్ పరంగా చూసుకుంటే రెండు ఇన్నింగ్స్ లలో రూట్ వరుసగా రెండు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ సెంచరీ ద్వారా టెస్ట్ లలో రూట్ శతకాల సంఖ్య 34కు చేరుకుంది. ఈ సెంచరీ ద్వారా రూట్ ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ రికార్డును గల్లంతు చేసాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ గా ఆవిర్భవించాడు. కుక్ టెస్ట్ లలో ఇంగ్లాండ్ జట్టు తరుపున 33 సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన యాక్టివ్ క్రికెటర్లలో రూట్ 34 శతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్, స్మిత్ తో కూడిన ఫ్యాబ్ జాబితాలో రూట్ మొదటి స్థానంలో ఉండడం విశేషం.. కెన్ విలియంసన్, స్టీవ్ స్మిత్ 32 సెంచరీలతో రెండవ స్థానంలో సంయుక్తంగా కొనసాగుతున్నారు. 29 సెంచరీలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.. 2021 జనవరిలో విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో రూట్ 17 శతకాలు మాత్రమే బాదాడు. అయితే గత మూడు సంవత్సరాలలో రూట్ తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు. ఏకంగా 17 సెంచరీలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులోకి ఎదిగాడు.
ముసలోడివి అయిపోయావన్నారు
రూట్ ను గతంలో సెలెక్టర్లు వన్డేలకు ఎంపిక చేయలేదు. ముసలోడివి అయిపోయావు.. వన్డేలకు పనికిరాని ముఖం మీద చెప్పేశారట. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకు వయస్సు పెరిగినా.. ఆడే సత్తా తగ్గలేదని నిరూపించాడు. అనితర సాధ్యమైన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు. గత మూడు సంవత్సరాలల్లో అతడు ఏకంగా 17 సెంచరీలు చేయడం ఇందుకు ప్రబల ఉదాహరణ.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Joe root who is useless for odis is scoring centuries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com