https://oktelugu.com/

Team India: వాళ్లు ఎలా ఆడినా.. అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటారా..ఇదేనా సమన్యాయం అంటే?

ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ దులీప్ ట్రోఫీ కోసం భారత జట్లను ప్రకటించింది. భారత జట్టు 10 టెస్ట్ మ్యాచ్ లను వచ్చే నాలుగు నెలల్లో ఆడనుంది. ఈ సిరీస్ లకు అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలంటే కచ్చితంగా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉండాలి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 15, 2024 / 09:14 PM IST

    Team India

    Follow us on

    Team India: టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. తన తదుపరి ఫోకస్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మీద పెట్టింది. అయితే గత ఏడది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ నేపథ్యంలో త్వరలో టెస్ట్ సిరీస్ లు ఆడాల్సి ఉండడంతో.. బీసీసీఐ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఉత్తమ టెస్ట్ జట్టును ఎంపిక చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు.. జాతీయ జట్టులోకి ప్రవేశించాలనుకునే ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ టోర్నీలు ఆడాలని స్పష్టం చేశారు.. ఇప్పటికే జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చారు. ఆటగాళ్ల ప్రదర్శన, సామర్థ్యం పరిశీలించేందుకు బీసీసీఐ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.. జట్టులో పోటీ ఉండాలని.. అందువల్లే ఇలాంటి విధానానికి శ్రీకారం చుట్టారు. దేశవాళీ టోర్నీలలో స్టార్ క్రికెటర్లు ఆడాల్సిన విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ” పోటీ తత్వాన్ని పెంచడం.. క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం.. బోర్డు ఉద్దేశాలు.. అందుకోసమే ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందని” జై షా వ్యాఖ్యానించారు.

    దులీప్ ట్రోఫీ కోసం..

    ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ దులీప్ ట్రోఫీ కోసం భారత జట్లను ప్రకటించింది. భారత జట్టు 10 టెస్ట్ మ్యాచ్ లను వచ్చే నాలుగు నెలల్లో ఆడనుంది. ఈ సిరీస్ లకు అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలంటే కచ్చితంగా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉండాలి. అందువల్లే టీమిండియా సెలక్టర్లు ఆటగాళ్ల ప్రతిభ పై దృష్టి సారించారు. పనిలో పనిగా దులీప్ ట్రోఫీ ఫార్మాట్ కూడా పూర్తిగా మార్చేశారు.. వాస్తవానికి ఈ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా ఆడతారని వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు గానీ బీసీసీఐ పెద్దలు వారికి విశ్రాంతి ఇచ్చారు. దులీప్ ట్రోఫీలో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు మాత్రమే జట్టులో ప్రవేశం లభిస్తుందని తెలుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా విశ్రాంతి ఇవ్వడం పట్ల మాజీ ఆటగాళ్లు ఫైర్ అవుతున్నారు. స్టార్ ఆటగాళ్లు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరైతే ఆ ముగ్గురు ఆటగాళ్లు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారని.. అలాంటి వారికి విశ్రాంతి ఇవ్వడంలో తప్పు లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, షమీ లాంటి వాళ్లకు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు..

    అవసరాలకు అనుగుణంగా

    టీమిండియా హైడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ మోర్కల్ టీమిండియా బౌలింగ్ కోచ్ ఎంపికైన నేపథ్యంలో.. అతడి ఆధ్వర్యంలో బౌలర్లు మరింత రాటు తేలుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగైనా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలుచుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్లు దేశవాళి క్రికెట్ లో సత్తా చాటాలని.. అప్పుడే భారత్ టెస్ట్ మ్యాచ్ లు గెలవగలుగుతుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.