Harish Shankar: ఇండస్ట్రీ లో ఒక డైరెక్టర్ టాప్ రేంజ్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఏ డైరెక్టర్ అయినా ముందుకు పోగలరు. రెండు, మూడు హిట్లు పడగానే నాకు మించిన తోపు ఎవరూ లేరు, నాకు అనిపించింది మాట్లాడతాను, అనిపించింది చేస్తాను అనే విధంగా ఒక డైరెక్టర్ ప్రవర్తన ఉంటే ఎదో ఒకరోజు దారుణమైన ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి అలాగే తయారైంది. ఈయన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రొమోషన్స్ కి ముందు ఎంత తల పొగరుతో మాట్లాడాడో మన కళ్లారా చూసాము. జర్నలిస్టులపై ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయాడు. ఇంత ధైర్యం తో మాట్లాడుతున్నాడంటే కచ్చితంగా గొప్ప సినిమానే తీసి ఉంటాడని రవితేజ అభిమానులు చాలా బలంగా నమ్మారు. అదే నమ్మకంతో నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమైన ప్రీమియర్ షోస్ కి వెళ్లారు. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ సినిమా ఇస్తాడు అనే అంచనాలతో వచ్చిన ప్రేక్షకులకు చుక్కలు చూపించి పంపాడు.
ఎంతసేపు హీరోయిన్ నడుము ని చూపించే దానిమీదనే హరీష్ శంకర్ ఫోకస్ పెట్టాడు కానీ, సినిమా మీద ఏమాత్రం పెట్టలేదని ఆడియన్స్ కి చూసిన మొదటి 30 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. పాటలు సినిమాకి ఒక రకంగా పాజిటివ్ అయ్యినప్పటికీ హరీష్ శంకర్ రొటీన్ టేకింగ్ ఆడియన్స్ సహనం కి పెద్ద పరీక్ష. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ పెట్టే వారిపై హరీష్ శంకర్ దండయాత్ర చేస్తున్నాడు. ఎలాంటి దండయాత్ర అంటే స్థాయి కూడా మర్చిపోయి, ఫ్యాన్ వార్స్ చేసుకునే గ్రూప్స్ లో సినిమా మీద నెగటివ్ ట్వీట్స్ షేర్ చేసాడు. ఆ గ్రూప్ లో జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో ట్రోల్ల్స్ ఉన్నాయి. ఇది బయటపడేలోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్న హరీష్ శంకర్ కి ట్విట్టర్ లో చుక్కలు చూపించేసారు. సినిమా అవకాశం ఇచ్చిన హీరో మీద ట్రోల్ల్స్ వేసే గ్రూప్ లో ఉంటావా, నువ్వు కూడా ఎన్టీఆర్ ని ట్రోల్ చేసేవాడివేనా..?, సినీ ఇండస్ట్రీ లో ఉంటూ ఇలాంటి పనులు చెయ్యడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ హరీష్ శంకర్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టేసారు. సోషల్ మీడియా లో తనపై ఏ నెగటివ్ ప్రచారం జరిగినా స్పందించే అలవాటు ఉన్న హరీష్ శంకర్, గ్రూప్ లో తాను షేర్ చేసిన ట్వీట్ గురించి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
అంటే కచ్చితంగా ఇది యాదృచ్చికంగా చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగానే చేసింది అంటూ నిర్ధారణకు వచ్చారు. దీనిపై హరీష్ శంకర్ భవిష్యత్తులో అయినా సమాధానం ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఆయన చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉంది. గబ్బర్ సింగ్ లాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు హరీష్ శంకర్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లాంటి సినిమా ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్ను ఇంటికొచ్చి మరీ కొడుతారు అంటూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి హెచ్చరిస్తున్నారు