Jasprit Bumrah : టీమిండియా ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాలో ఎవరికి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. గత ఏడాది టెస్ట్ క్రికెట్లో జస్ ప్రీత్ బుమ్రా సరికొత్త ఘనతను సృష్టించాడు. దీంతో అతడికి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -2024 పురస్కారానికి ఎంపిక చేసింది.
గత ఏడాది జస్ ప్రీత్ బుమ్రా లాగానే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్, ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడారు. అయితే వారందరిని జస్ ప్రీత్ బుమ్రా వెనక్కి నెట్టాడు. ఏకంగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.. భారత జట్టులో ఇప్పటివరకు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఐదుగురు క్రికెటర్లు అందుకున్నారు.. తాజా పురస్కారానికి జస్ ప్రీత్ బుమ్రా ఎంపికైన నేపథ్యంలో.. ఈ ఘనత అందుకున్న ఆరవ టీమ్ ఇండియా ఆటగాడిగా నిలిచాడు.. 2004లో రాహుల్ ద్రావిడ్, 2009లో గౌతమ్ గంభీర్, 2010లో వీరేంద్ర సెహ్వాగ్, 2016లో రవిచంద్రన్ అశ్విన్, 2018లో విరాట్ కోహ్లీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. అయితే పేస్ బౌలర్ల విభాగంలో ఇంతవరకు టీమిండియా నుంచి ఏ ఒక్క ఆటగాడు కూడా ఐసీసీ పురస్కారాన్ని అందుకోలేదు. అయితే ఈ ఘనత సాధించిన టీమిండియా పేస్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 లోనూ జస్ ప్రీత్ బుమ్రా కు ఐసీసీ చోటు కల్పించింది. గత ఏడాది టెస్ట్ క్రికెట్లో జస్ ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 13 టెస్టులలో అతడు ఏకంగా 71 వికెట్లు సాధించాడు. అంతేకాదు గత ఏడాది హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఘనతను సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ ప్రీత్ బుమ్రా 32 వికెట్లు సాధించడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో జస్ ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పికి గురయ్యాడు. ఆ టెస్ట్ నుంచి అతడు అర్ధాంతరంగా నిష్క్రమించాడు. ప్రస్తుతం అతడు వెన్ను నొప్పికి చికిత్స పొందుతున్నాడు. అతడిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది.
ఆడతాడో? లేదో?
బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో వెన్ను గాయానికి గురయ్యాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ నియమించిన మెడికల్ బృందం అతన్ని పర్యవేక్షిస్తోంది. బుమ్రా ను త్వరలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే అతడు గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది. బుమ్రా త్వరగా కోలుకుంటే టీమిండియాకు తిరుగుండదు.. ఒకవేళ కోలుకోకపోతే ఎదురుదెబ్బ తప్పదు. బుమ్రా కు వెన్ను నొప్పి తీవ్రంగా కావడం వల్లే అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోతున్నాడని.. అతడిని పరీక్షిస్తున్న వైద్యుల బృందం అంటున్నది. ” బుమ్రా కు వెన్నునొప్పి తీవ్రంగా అయింది. దానివల్ల అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు నూటికి నూరు శాతం సామర్థ్యాన్ని సాధించడం దాదాపు కష్టమే. ప్రస్తుతం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ అతడు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.. నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. న్యూజిలాండ్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన ఆర్థోపెడిషియన్ కూడా బుమ్రాను పర్యవేక్షిస్తున్నారు..మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమని” టీమిండియా మెడికల్ బోర్డు వైద్యులు చెబుతున్నారు.