Ravi Teja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి కొత్త తరం హీరోలకు ఆదర్శప్రాయంగా నిల్చిన హీరోల లిస్ట్ తీస్తే మనకి మెగాస్టార్ చిరంజీవి తర్వాత, మాస్ మహారాజ రవితేజనే గుర్తుకొస్తాడు. ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు సక్సెస్ లు అందుకోగానే, ప్రతీ కొత్త హీరో వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చాం అని చెప్పుకోవడం ఇది వరకు మనం అనేక సందర్భాల్లో చూసాము. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా చేసి, ఆ తర్వాత హీరోగా మారి ఇంత దూరం వచ్చాడు. కేవలం రవితేజ ఒక్కడే ఎదగడం కాదు, తనతోపాటు ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులతో ఎదిగేలా చేసాడు. ఇప్పటికీ ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేసేదానికంటే, కొత్త వాళ్లనే ప్రోత్సహిస్తూ వస్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే రవితేజ ఇంత సక్సెస్ అవ్వడానికి కచ్చితంగా ఆయన టాలెంట్ అందుకు కారణం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా కలిసి వచ్చింది. అది కూడా ఒక హీరో కారణంగా. ఆ హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పట్లో రవితేజ కెరీర్ లో ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రాలు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం, ప్రతీ సన్నివేశాన్ని ఆయన్ని ఊహించుకునే రాశాడు. ఆయనకీ వెళ్లి ఈ స్టోరీలు వినిపించగా ఎందుకో రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజ చేతుల్లోకి వచ్చాయి. ఈ రెండు చిత్రాల తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. చూస్తుండగానే స్టార్ హీరో గా ఎదిగిపోయాడు.
అయితే రవితేజ ఈమధ్య కాలం లో కొత్త డైరెక్టర్స్ ని నమ్మి తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. ధమాకా తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని మినహాయిస్తే, మిగిలిన సినిమాలన్నీ కొత్త డైరెక్టర్స్ తో చేసినవే. అవన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. మినిమం గ్యారంటీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న రవితేజ, ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ ని మెల్లిగా తగ్గించేసుకున్నాడు. ఇప్పుడు కచ్చితంగా ఆయనకు ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఆ బ్లాక్ బస్టర్ ‘మాస్ జాతర’ రూపం లో త్వరలోనే రాబోతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా, అవి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. వింటేజ్ రవితేజ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.