Jasprit Bumrah: అద్భుతమైన బంతులు వేస్తూ.. కొరకరాని కొయ్యల లాంటి ప్లేయర్లను కూడా అవుట్ చేస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు జస్ ప్రీత్ బుమ్రా. టెస్ట్, వన్డే, టి20 ఇలా ఫార్మాట్లతో సంబంధం లేకుండా తనను తాను సరికొత్తగా నిరూపించుకున్నాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. అక్కడిదాకా ఎందుకు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బీజీటీ సిరీస్ లో కమిన్స్ కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి.. అద్భుతమైన రికార్డు అందుకున్నాడు. కంగారు గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి టీమ్ ఇండియా బౌలర్ గా అతడు అరుదైన చరిత్ర సృష్టించాడు. కంగారులతో పెర్త్ వేదికగా తలపడిన సందర్భంలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు బుమ్రా.. అందులో కంగారులను ఓడించాడు. తనదైన బౌలింగ్ మ్యాజిక్ వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతటి చరిత్ర ఉన్న బుమ్రా ఇటీవల తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. ఆ గాయాలు ఎంతకీ తగ్గకపోవడంతో కీలకమైన సిరీస్ లకు దూరమవుతున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరమయ్యాడు. అతడు లేకపోయినప్పటికీ ఉన్న బౌలర్లతోనే టీమ్ ఇండియా సత్తా చాటింది. ఏకంగా సిరీస్ విజయాన్ని అందుకుంది.
కెరియర్ క్లోజేనా?
బుమ్రా పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అతడు గాయాల నుంచి ఇంతవరకుసరిగ్గా కోలుకోలేదని తెలుస్తోంది. అందువల్లే అతడిని కెప్టెన్ గా ఎంపిక చేయలేదని జట్టు మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ” అతడిని గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. ఆ గాయాలు ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. పైగా అతడి సామర్థ్యం నిలకడగా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని సారధిగా ఎంపిక చేసి జట్టు భవితవ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టలేమని” బిసిసిఐ సెలక్షన్ కమిటీ అజిత్ ఆగార్కర్ పేర్కొన్నాడు. అజిత్ మాట్లాడిన మాటల ప్రకారం బుమ్రా ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ కు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక రెండు లేదా మూడు టెస్టులకు మాత్రమే పరిమితం అయితే.. అతడి స్థానాన్ని ఇతర బౌలర్లతో భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇవే గాయాలు గనక బుమ్రా కు కంటిన్యూ అవుతే అతని కెరియర్ క్లోజ్ అయినట్టేనని తెలుస్తోంది. ఇప్పటికే అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. గతంలోనే అతడికి సర్జరీ అయింది. అయినప్పటికీ ఆ గాయం అతడిని ఇబ్బంది పెడుతూనే ఉంది. కంగారులతో జరిగిన బి జి టి సిరీస్ లో సిడ్ని లో తలపడిన మ్యాచ్లో మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి అతడు నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు అతడు చికిత్స పొందాడు. ఇక ఇటీవల ఐపీఎల్లో ముంబై జట్టులోకి ఆలస్యంగా ప్రవేశించాడు. ఆయనప్పటికీ ఇబ్బంది పడుతూనే బౌలింగ్ వేస్తున్నాడు.
విపరీతమైన ఒత్తిడి.. పదే పదే బౌలింగ్ వేయించడం.. బౌలింగ్ భారాన్ని ఒక్కడే మోయడంతో బుమ్రా కు ఇబ్బంది కలిగిస్తోందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అతడి భారాన్ని మరొక బౌలర్ మోసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అవిశ్రాంత క్రికెట్ ఆడటం వల్ల బుమ్రా శరీరం ఒత్తిడికి గురవుతోందని.. అందువల్లే అతడు గాయాల బారిన పడుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ++ కేటగిరి లో చోటు సంపాదించుకున్న బుమ్రా.. ఇలా సాధారణ ఆటగాడిగా మిగిలిపోవడం మాత్రం సగటు క్రికెట్ అభిమానికి ఏమాత్రం నచ్చడం లేదు. అయితే అతడిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటామని అజిత్ అగర్కర్ పేర్కొనడం విశేషం.