Sachin Tendulkar Son: జట్టులో స్థానం మాత్రమే కాదు.. ఇప్పుడు ఏకంగా నాయకుడు అయిపోయాడు. స్వల్ప కాలంలోనే జట్టు పగ్గాలు అందుకొని.. ఇంగ్లీష్ జట్టుతో ఆడే ఐదు టెస్టుల సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇంతటి ప్రయాణం వెనుక అతడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అతని పేరే శుభ్ మన్ గిల్. మొదట్లో వన్డేలలో గిల్ సిసలైన అటాకింగ్ ఆట తీరుకు నిదర్శనంగా నిలిచాడు. ఆ తర్వాత టి20 లలోనూ సత్తా చాటాడు. కొన్ని సందర్భాల్లో జట్టులో స్థానం లభించకపోయినప్పటికీ.. తను ఏంటో నిరూపించుకున్నాడు. చివరికి జట్టు నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. గొప్ప గొప్ప ప్లేయర్లను పక్కనపెట్టి.. సీనియర్లను సైతం దూరంగా పెట్టి గిల్ కు జట్టు మేనేజ్మెంట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించిందంటే.. అతడి సామర్థ్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గిల్ సారధిగా నియమితులైన వేళ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా క్రికెట్ గాడ్ కుమారుడిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే శుభ్ మన్ ఎటువంటి నేపథ్యం లేకుండా క్రికెట్ లోకి వచ్చాడు. తన సామర్థ్యాన్ని మాత్రమే పూర్తిగా నమ్ముకున్నాడు. ఇటువంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి.. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. వన్డే, టి20, టెస్ట్, దేశవాళి.. ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు తీశాడు. తద్వారా తనమీద జట్టు మేనేజ్మెంట్ కు నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. అన్నింటికంటే ఐపీఎల్ లో గుజరాత్ జట్టును ప్రస్తుత సీజన్లో అన్ని రంగాలలో ముందుండి నడిపిస్తున్నాడు. మామూలు ప్లేయర్లతో సైతం అద్భుతమైన విజయాలు అందుకునేలా చేస్తున్నాడు. అందువల్లే అతని మీద జట్టు మేనేజ్మెంట్ పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచింది. ఏకంగా సారధిగా నియమించింది. తద్వారా టెస్ట్ చరిత్రలో యువశకానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది.
గిల్ అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ లో సచిన్ టెండుల్కర్ కుమారుడు ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. అని ఇంతవరకు అతనికి ఒక మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభించలేదు. ప్రతి మ్యాచ్ లోను అతన్ని రిజర్వ్ బెంచికే పరిమితం చేస్తున్నారు. ఎందుకంటే అతడి బౌలింగ్లో లయ లేకపోవడంతో దూరం పెడుతున్నారు. వాస్తవానికి మెగా వేలంలో అతడిని ముంబై మేనేజ్మెంట్ కొనుగోలు చేయలేదు. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్జున్ ముంబై జట్టులో చేరిపోయాడు. అది కూడా తక్కువ ధరకే. ఆయనప్పటికీ అర్జున్ కు ఆడే అవకాశం లభించడం లేదు. మరోవైపు అర్జున్ కంటే చాలా ఆలస్యంగా కెరియర్ మొదలు పెట్టినవారు కెప్టెన్ దాకా వచ్చారు. టీమ్ ఇండియాను నడిపిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే సునీల్ గవాస్కర్ కుమారుడు రోహన్ గవాస్కర్ మాదిరిగానే.. సచిన్ కుమారుడి కెరియర్ కూడా కాలగర్భంలో కలిసిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.