Rohit Sharma : 2027 వన్డే వరల్డ్ కప్ లో బిసిసిఐ రూపొందించే జట్టులో రోహిత్ శర్మ లేడు.. నిన్నటి నుంచి మీడియాలో ఇదే వార్త. వాస్తవానికి దీనిని అధికారికంగా బీసీసీఐ గాని.. రోహిత్ శర్మ గాని ధ్రువీకరించలేదు. కానీ ప్రకటన కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో ఇదంతా కూడా ఊహాగానమే అని అందరూ అనుకున్నారు. రోహిత్ శర్మ మీద ఇలాంటి ఊహగానాలు పెరిగిపోయాయి. ఇదేమి కొత్త కాకపోయినప్పటికీ.. ఈసారి జరిగిన ప్రచారం మాత్రం చాలా బలంగా ఉంది.
భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయినప్పుడు.. అసలు అతడు వన్డే ఫార్మాట్లో కొనసాగడంలో అర్థం లేదని కొంతమంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాలకు బలం చేకూర్చుతూ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వార్త ప్రధాన మీడియాలో ప్రసారమవుతోంది. దీంతో రోహిత్ శర్మ కు బీసీసీఐ షాక్ ఇచ్చినట్టు దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
ఎల్లుండి లార్డ్స్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో మూడవ వన్డే ఆడబోతోంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేకపోయినప్పటికీ.. రోహిత్ శర్మ కుటుంబం లార్డ్స్ వచ్చేసింది. తల్లిదండ్రులు.. భార్య పిల్లలు ప్రత్యేకమైన విమానంలో లార్డ్స్ చేరుకోవడంతో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది. 2027 వన్డే వరల్డ్ కప్ కి రోహిత్ శర్మను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. దీనిపై బీసీసీఐని రోహిత్ సంప్రదించాడు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల జరిగిన తీర్పట్ల రోహిత్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాజాగా వస్తున్న వార్తలు కనుక నిజమైతే రోహిత్ శర్మకు ఇది చివరి వన్డే కాబోతోంది ఇప్పటికే అతడు టి20కి.. టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు..
ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు మీద అతడు అంత గొప్పగా ఆడలేక పోతున్నాడు. ఒకప్పటి మాదిరిగా కాకుండా వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. బంతిని ఎదుర్కోవడంలో స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాడు. బరువును కూడా పూర్తిగా తగ్గిపోయాడు. అయినప్పటికీ అతడికి వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కదు అని ప్రచారం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబం లార్డ్స్ రావడం.. నేరుగా రోహిత్ శర్మను కలవడం.. ప్రధాన జాతీయ మీడియాలో రోహిత్ శర్మకు సంబంధించిన రిటర్మెంట్ వార్తలు ప్రముఖంగా ప్రసారం కావడంతో.. ఏదో జరుగుతోంది అనే చర్చ మొదలైంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే ఎల్లుండి వరకు ఎదురుచూడాల్సిందే.
image.png
