Homeఎంటర్టైన్మెంట్Teja Director: ‘జయం’ ఆడిషన్లో అల్లు అర్జున్ బాగోలేడని రిజెక్ట్ చేసిన తేజ...కట్ చేస్తే...

Teja Director: ‘జయం’ ఆడిషన్లో అల్లు అర్జున్ బాగోలేడని రిజెక్ట్ చేసిన తేజ…కట్ చేస్తే…

Teja Director: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మాత్రం చాలా వరకు విమర్శలను ఎదుర్కొన్నాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. అయినప్పటికి లుక్స్ పరంగా అంత బాగాలేడని అతన్ని హీరోగా ఎలా తీసుకున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే అల్లు అర్జున్ హీరో అయిన తర్వాతనా కాదు హీరో అవ్వక ముందే కొన్ని విమర్శలను ఎదుర్కొన్నాడట. తేజ డైరెక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమా ఆడిషన్స్ కి అల్లు అర్జున్ అటెండ్ అయ్యారట. అక్కడ ఆడిషన్స్ చేస్తున్న తేజ అల్లు అర్జున్ నటనకి ఇంప్రెస్ అయినప్పటికి లుక్స్ పరంగా ఆయన అంత బాగాలేడని తన కథకి అతను సెట్ కాడని చెప్పారట. దాంతో అల్లు అర్జున్ చాలా వరకు నిరుత్సాహపడ్డట్టుగా తెలుస్తుంది.

ఇక అదే సమయంలో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి అల్లు అర్జున్ ని పిలిపించి అతనికి ధైర్యాన్ని ఇచ్చాడట. ఒక నటుడికి కెరియర్ స్టార్టింగ్ లో లుక్స్ పరంగా విమర్శలు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందనేది చిరంజీవికి బాగా తెలుసు… ఎందుకంటే తన కెరియర్ స్టార్టింగ్ లో అలాంటి వివక్షలు ఆయన కూడా చాలావరకు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా ఉండడానికి అల్లు అర్జున్ కి కొంత వరకు ధైర్యాన్ని చెప్పారట.

అందులో భాగంగానే తను చేసిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ కి ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేసి అతని చేత ఆ క్యారెక్టర్ లో నటింపచేశాడు. మొత్తానికైతే డాన్సర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల మనుషులు గెలుచుకున్నాడు.

సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ గా అవతరించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… అల్లు అర్జున్ కి వారసత్వంగా సపోర్ట్ ఉన్నప్పటికి ఆయన చాలా రకాల విమర్శలైతే ఎదుర్కొన్నాడు. అయినప్పటికి తనకి చిరంజీవి తోడుగా ఉండి అతన్ని హీరోగా చేయడంలో చిరంజీవి సైతం కీలకపాత్ర వహించాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version