Iyer Selection Impact : పది జట్లు పోటీపడుతున్న ఐపీఎల్ లో ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు. 2008 నుంచి 2024 వరకు పోటీపడినప్పటికీ ఇంతవరకు బెంగళూరు ట్రోఫీ అందుకోలేకపోయింది. అంతటి బలమైన జట్టుకు కూడా ట్రోఫీస్ అర్థం కాలేదంటే ఐపీఎల్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది గత సీజన్లో కోల్ కతా జట్టును విజేతగా నిలిచేలా చేశాడు అయ్యర్. 2014 తర్వాత దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ అనంతరం కోల్ కతా జట్టును అతడు ఛాంపియన్ చేశాడు. అయితే అంతటి విజయవంతమైన నాయకుడిని షారుక్ ఖాన్ జట్టు వద్దనుకుంది. చివరికి అజింక్యా రహానే కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కానీ నిరుడు విజేతగా ఆవిర్భవించిన జట్టు.. ఈసారి గ్రూప్ దశ నుంచే వెళ్ళిపోయింది. ఇక తనను భారీ ధరకు కొనుగోలు చేసిన జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు అయ్యర్.
Also Read : తొలిసారి ఐపిఎల్ ట్రోఫీ గెలుద్దాం అనుకుంటున్న వేళ.. బెంగళూరుకు అదిరిపోయే న్యూస్!
వాస్తవానికి అయ్యర్ అనితర సాధ్యమైన మెరిట్ ఉన్న ఆటగాడు. మధ్యలో గాయాల వల్ల కాస్త ఇబ్బంది పడ్డాడు. గత సీజన్లో షారుక్ ఖాన్ జట్టు ఛాంపియన్ చేశాడు. 2014 తర్వాత టైటిల్ అందించాడు. అయితే అతడిని షారుక్ ఖాన్ జట్టులో ఉంచుకోలేదు. దీంతో అయ్యర్ ను పంజాబ్ యాజమాన్యం భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా వేలంలో సెకండ్ హైయెస్ట్ ప్రైస్ అయ్యర్ కే దక్కింది. అయితే అయ్యర్ ను జట్టులో కొనసాగించకుండా.. వెంకటేష్ అయ్యర్ అనే ఆటగాడిని 23 కోట్లతో రిటైన్ చేసుకుంది షారుక్ ఖాన్ జట్టు. వాస్తవానికి వెంకటేష్ అయ్యర్ గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. అతడికి పది కోట్లే చాలా ఎక్కువ. కానీ అతను ఊహించిన దానికంటే ఎక్కువ ధర పెట్టి.. జట్టులో ఉంచుకుంది. తీరా చూస్తే ఈ సీజన్లో వెంకటేష్ అంతగా ఆకట్టుకోలేదు. ప్రారంభ మ్యాచ్లలో అతడు విఫలం కావడంతో.. గాయాన్ని కారణంగా చూపి అతనికి రెస్ట్ ఇచ్చారు. కనీసం సగం మ్యాచులు పూర్తికాకముందే వెంకటేష్ అయ్యర్ పేరు స్పురణలోనే లేకుండా పోయింది.
శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో దుమ్ము రేపుతున్నాడు.. గొప్ప గొప్ప ఆటగాళ్ల కంటే అద్భుతంగా ఆడుతున్నాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు 603 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 175.80 కొనసాగిస్తున్నాడు. హైయెస్ట్ రన్స్ కేటగిరిలో ఆరో ప్లేస్ లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ మాత్రం తనకంటే ముందున్న ఐదురికంటే ఎక్కువ.. వాస్తవానికి కోల్ కతా మరో 10 కోట్లు ఇచ్చి అంటి పెట్టుకుంటే అయ్యర్ జట్టులో ఉండేవాడు. కానీ అతడిని షారుఖ్ ఖాన్ జట్టు వద్దనుకుంది. వచ్చిందే అవకాశం గా పంజాబ్ యాజమాన్యం అతడిని కొనుగోలు చేసింది. 23 కోట్లతో అంటిపెట్టుకున్న వెంకటేష్ చేతులెత్తేశాడు. 2020 లో 20 లక్షల కనీస ధరతో కోల్ కతా లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడికి 8 కోట్లు ఇచ్చింది. ఈ సీజన్లో మాత్రం ఏకంగా 23 కోట్లకు పెంచింది. ఇక పంజాబ్ 2014లో ఐపీఎల్ చివరి అంచె పోటీలకు చేరుకుంది. నాడు కోల్ కతా చేతిలో పరాజయం పాలైంది.