Jasprit Bumrah : సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. ఇప్పటికే ఈ టెస్ట్ కు సంబంధించి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది.. అయితే ఈ జట్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ ప్రీత్ బుమ్రా కు అవకాశం లభించడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యానికి కారణమైంది. బంగ్లాదేశ్ నుంచి మొదలుపెడితే న్యూజిలాండ్ జట్టు వరకు టీమిండియా మొత్తం 10 టెస్ట్ మ్యాచ్లను వచ్చే నాలుగు నెలల కాలంలో ఆడనుంది.. ఆస్ట్రేలియా జట్టుతో ఏకంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులు ఆడుతుంది.. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జస్ ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా టీమిండియా మేనేజ్మెంట్ జస్ ప్రీత్ బుమ్రా కు చోటు కల్పించింది.. అయితే అతడిని జట్టులోకి తీసుకోవడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది..
బుమ్రా కోరిక మేరకే..
బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లోకి జస్ ప్రీత్ బుమ్రా కోరిక మేరకే అతడిని ఎంపిక చేశారని జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ధ్రువీకరించారు..” బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడాలా? వద్దా? అనేది అతడి నిర్ణయం. జస్ ప్రీత్ బుమ్రా తన శరీరంపై ఒక అవగాహన ఉందని” బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. జస్ ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఇటీవల జరిగిన శ్రీలంక టోర్నీలో భారత బౌలింగ్ పూర్తిగా లయ తప్పింది. ఫలితంగా సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించింది. సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకులలో ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది.
స్పిన్ బౌలింగ్ లో విఫలం
భారత బాటర్లు స్పిన్ బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమయ్యారు.. అందువల్లే జస్ ప్రీత్ బుమ్రా ను ఎంపిక చేసి భారత బౌలింగ్ లైన్ అప్ పూర్తిగా పటిష్టం చేయాలని మేనేజ్మెంట్ భావించింది అందులో భాగంగానే అతడికి అవకాశం కల్పించింది. “విశ్రాంతి ఇవ్వడం వల్ల తన శరీరంపై జస్ ప్రీత్ బుమ్రా ఏకాగ్రత కోల్పోతున్నాడు. ఆ భయంతోనే అతడు జట్టులోకి రావాలనుకున్నాడు. ఇప్పుడు ఎంపిక చేసిన తర్వాత రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఆయనప్పటికీ భారత బౌలింగ్ దళానికి జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక అనడంలో సందేహం లేదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..
తరచుగా గాయాలు
మరో వైపు జస్ ప్రీత్ బుమ్రా ఇటీవల తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ కోసం అతడికి ఏకంగా నెలలపాటు విశ్రాంతి ఇచ్చారు.. దీంతో కొన్నిటోర్నీలలో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. అటువంటి పరిణామం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ ల ముందు ఎదురు కావద్దని.. బంగ్లాదేశ్ సిరీస్ కు బుమ్రా ను ఎంపిక చేయొద్దని మేనేజ్మెంట్ భావించింది. కానీ అంతిమంగా బుమ్రా మాటకు ఓటు వేసింది. “ఇప్పటికీ భయంగానే ఉంది.. జట్టులోకి రాకపోతే మరో విధంగా అనుకుంటారని” బుమ్రా వ్యాఖ్యానించడంతోనే సెలెక్టర్లు అతడికి జట్టులో స్థానం కల్పించారని తెలుస్తోంది.